రామాయణ విశేషములు
67
ఉన్న యొక్క కూతురును ఎవడో అంగరాజట, అతనికి దత్తుగా ఇచ్చి వేసెను. ఈ కథయంతయు కల్పితమే యని స్పష్టము
7
రాముడు వనవాసమునకు వెళ్ళుచు కైకతో ఇట్లు శపథము చేసెను:
చతుర్దశహి వర్షాణి వత్స్యామి విజనే వనే, మధుమూల ఫలైర్జీవన్
హిత్వా మునివ దామిషం.
- అయోధ్య. 20-29
నేను ఈ 14 ఏండ్లు మాంసము తినకుండ మునివలె అరణ్యంలో
ఉంటాను అని మాటయిచ్చి నాలుగైదు దినాలకే అరణ్యానికి పోయిన ఆది
లోనే ఆ శపథాన్ని మరచిపోయెనా? గంగనుదాటి మొదటిదినమే
అరణ్యావాసము చేసిననాడు నాలుగు పెద్దమృగాలను చంపి తానును
సీతయు లక్ష్మణుడును తినినారు.
“తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్, వరాహ మృశ్యం పృషతం మహారురుం
అదాయ మేధ్యం త్వరితం బుభుక్షితౌ, వాసాయ కాలే యయతు ర్వనస్పతిమ్. - అయోధ్య. 50-102.
ఇంతేకాక ఇంచుమించు పది యిరువదితావులందు రామాదులు
మాంసమును తిన్నట్లు వర్ణించినారు. హనుమంతుడు సీతతో ఇట్లన్నాడు:
“రాముడు మీ వియోగదుఃఖముచే మద్యమాంసములను వదలివేసినాడు.”
(సుం.36-41)
దీనినిబట్టి రామాదుల మాంసభక్షణమో లేక తద్వర్జనమో ఏదో
యొక భాగము ప్రక్షిప్తమైనదనుట స్పష్టము.