66
రామాయణ విశేషములు
ఏండ్లకు ముందుండినవాడు. అయితే యీ లెక్క కలికాలపులెక్క. కృత యుగములో దశరథుడే 60,000 ఏండ్లు జీవించెను. మరి అతని పూర్వికులు ఒక్కరొక్క రెన్నివేలయేండ్లు జీవించిరోయేమో? ఆ లెక్క ప్రకారము చూచిన మనకేమియు అర్థము కానేరదు. రామునికన్న 29 తరములకు ముందుండిన అనరణ్యుని రావణుడు చంపినాడన్న రావణుని వయస్సెంత యుండవలయునో గణితశాస్త్రజ్ఞులును, జ్యోతిష్కులును, పౌరాణికులును కలిసి లెక్కలు వేయుచుండవలసినదే !
జైన రామాయణములో ఇట్లు వ్రాసినారు: “విజయుడు అయోధ్య నేలుచుండెను. అతని తర్వాత 27 గురు రాజ్యముచేసిరి. కడపటివాడగు అనరణ్యుడు రఘుమహారాజు కుమారుడు. అతనికి దశరథుడు పుట్టెను. దశరథునికి రామాదులు పుట్టిరి.” దీనినిబట్టి అనరణ్యుడే అజమహారాజని తేలును. ఇది రామాయణకథకన్న ఎక్కువగా విశ్వసనీయమై యున్నది.
రాముడు చిన్నవాడుగా ఉండినప్పుడు రావణుడు రాముని తాతకాలమువాడుగా నుండెనని దీనివలన అర్థమగును. అయినను వృద్ధ రావణునికి పరకాంతాకాంక్ష యెట్లు కలుగును? మొత్తాని కీ విషయము ప్రక్షిప్తమని తోచుచున్నది.
దశరథుడు అశ్వమేధమును చేయించుటకు ఋశ్యశృంగుని పిలిపించెను. అతడెవరైనది దశరథునికి తెలియదు. అందుచేత తన మంత్రి అతనికథను తానుగూడా ఎవరో పూర్వములో చెప్పగా విని దశరథుని కరిగించెను. ఋశ్యశృంగుడు తుదకు దశరథుని అల్లుడే! అల్లునిసంగతి మామకే తెలియకపోయెను పాపము! శాంత అను కూతురు దశరథునికి ఉండెనట. ఆమె ఏ దేవేరికి పుట్టెనో యేమో జాడయే కానరాదు. దశరథుని కంతవరకు కుమారులు జనింపలేదు. అట్టిస్థితిలో