Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

63

పురుషునిగా వర్ణించినాడు. రఘు వంశ దశమసర్గలో విష్ణువు ఋషులతో తాను దుర్మార్గవధార్థమై దశరథుని కుమారుడుగా పుట్టుదునని చెప్పెనని తెలిపెను. పదమూడవ సర్గములోని మొదటి శ్లోకమందే “రామాభిధానో హరిః" రామునిపేరుతో వర్తిస్తున్న హరి (విష్ణువు) అని వర్ణించెను. కాళిదాసు రామాయణకథలో నంతటను శ్రీరాముని అవతారపురుషుని గానే వర్ణించెను. అయితే కాళిదాసెప్పటివాడు? భాససౌమిల్లకుల తర్వాతి వాడనని తానే తన మాళవికాగ్నిమిత్రములో తెలుపుకొనెను. ఈ నాటకములోని ఆగ్నిమిత్రుడు మగధరాజగునేని (అవునని పలువు రన్నారు) కాళిదాసు క్రీస్తునకు పూర్వము 150 ప్రాంతము వాడగును. మరికొందరు గుప్తరాజులలో చంద్రగుప్తుడనువాడు విక్రమార్క బిరుద మును వహించెననియు కావున కాళిదాసప్పటివాడనియు అనగా ఇంచు మించు క్రీ. శ. 450 ప్రాంతమువాడనియు నందురు. కావున రాముని అవతార తత్వము క్రీ. పూ. 150 ముందు లేకుండెననియు క్రీస్తుశకము 350 లోపల నేర్పడెననియు అనవచ్చును

6

శ్రీమద్రామాయణములో రాముడు తాను విష్ణ్వవతారమను మాటను మరిచిపోయి యుండెను. రావణునితో యుద్ధముచేయు సందర్భ ములో అతనికి దేవతలు ఈ విషయాన్ని జ్ఞాపకముచేసిపోయిరి. రామ లక్ష్మణులు నాగపాశ బద్ధులైనప్పుడు గరుత్మంతుడు దివ్యజ్ఞానముతో నీ సంగతిని గ్రహించి వెంటనే రణభూమికి వెళ్ళి నాగపాశములనుండి రామ లక్ష్మణసోదరులను విడిపించగా రాముడు తెలివినొంది "ఓయీ, నీ వెవ్వరు?" అని ప్రశ్నింపగా “నేను మీకు స్నేహితుడను" అని గరుత్మంతుడు చెప్పెను. రాముడు తన స్నేహితు నెట్లు మరిచిపోయెను?

అప్పుడప్పుడు రాముడు మనిషివలెనే ఆచరించుటను వ్యాఖ్యాతలు సమన్వయించినారు. ఆవిధముగా అతడు నటన చేసెనట! అక్కడక్కడ