62
రామాయణ విశేషములు
5
గుప్తరాజుల కాలమువరకు ( క్రీ. శ. 500 ) శ్రీరామపూజకు స్థానము లేకుండెననియు, రామ దేవాలయములు లేకుండెననియు రామ భక్తులమని యేరాజులును తెలుపుకొన్న జాడలు లేవనియు క్రీ. శ. 500 అనంతరమే రామపూజా ప్రాముఖ్యము వ్యాపించెననియు (New history of the Indian People-Vol. VI) తెలియవచ్చినది. దశావతార ములు క్రీస్తుశకము నాల్గవ శతాబ్దము తర్వాతనే ఒక రూపానికివచ్చి స్థిర పడెను. బుద్ధుని మతవ్యాపకమును గమనించి హిందూమత పునఃస్థాపకులు బుద్ధుని తొమ్మిదవ అవతారముగా అంగీకరించిరి. అమరసింహుడు క్రీస్తు శకము 300 ప్రాంతకాలములో నుండినట్లూహింపబడుచున్నది. అతని కాలము వరకు దశావతార స్వరూప మేర్పడలేదు. ఏర్పడియుండిన ఎన్నియో యల్పవిషయాలను తెలిపి యతడీ మహద్విషయము నెగుర గొట్టెననుటకు వీలులేదు. అతడు బౌద్ధుడైయుండును. అతని మొదటి శ్లోకము “దయాసింధువును" గూర్చినది. దేవతల పేర్ల పట్టికలో మొదట బుద్ధుని పేళ్ళుచెప్పి తర్వాత విష్ణువుపేళ్ళు తెలిపినాడు. జైనుడై యుండిన మహావీరుని కాని తీర్థంకరులను గాని జైనమత ప్రతిపాదకుల నెవ్వరినిగాని పేర్కొనకుండా యుండునా? అతడు విష్ణువు పర్యాయపదములలో కృష్ణుని "దేవకీనందనుని” బలి ధ్వంసి" యగు "త్రివిక్రముని" మాత్రమే పేర్కొన్నాడు. దశరథ రాముని పేరెత్తుకొననేలేదు! బలరాముని విష్ణు నామములలో చేర్చక వేరుగాతెలిపెను. అంతమాత్రమైనను శ్రీరామచంద్రునిగూర్చి తెలుపలేదు. ఆదేవిధముగా ఋషులలో “నారదాదులు” అన్నాడు. కాని అచ్చటగాని ధీవర్గమందుకాని, వాగ్వర్గమందుకాని, యెచ్చటకాని ఆదికవియగు వాల్మీకిని పేర్కొనలేదు. దీనినిబట్టి అమరసింహుని కాలమువరకు శ్రీరామ ప్రాముఖ్యముకాని అవతారత్వముకాని స్థిరపడలేదని. తలప వచ్చును. కాని కాళిదాసు మాత్రము శ్రీరాముని స్పష్టముగా అవతార