రామాయణ విశేషములు
61
సిద్ధాంతము కల్పితమయ్యెను. ఇంకను ఏవేవి దశావతారాలో స్పష్టపడ లేదు. అందుచేత వివిధ పురాణాలలో వివిధ పద్ధతులపై వ్రాయుచు వచ్చిరి.
“మత్స్యః కూర్మో వరాహశ్చ నృసింహో వామనస్తథా
భార్గవో రాఘవః కృష్ణః బుద్ధః కలికిరేవచ .”
ఈ శ్లోకము మహాభారతము 12-348-2 అనుచోట ఉన్నదని
జ. మో. చటర్జీగారు పృశ్నిగాథా పీఠికలో వ్రాసిరి. ఆది యందు కాన
రాలేదు. పైగా ఈ క్రింది శ్లోకము మాత్రము మహాభారతమందు కనబడు
చున్నది:
హంసః కూర్మశ్చ మత్స్యశ్చ ప్రాదుర్భావా ద్ద్విజోత్తమ
వారాహో నరసింహశ్చ వామనో రామ ఏవచ
రామో దాశరథిశ్చైవ సాత్వతః కల్కి రేవచ .”
మహాభారతం - శాంతి. 339 - 100
ఇందు బుద్దునిపేరు లేదు. రాబోవు కల్కి పేరున్నది. సాత్వతు
డనగా బలరాముడా కృష్ణుడా అను సంశయానికి తావులేకుండా పైభాగ
మందు శిశుపాల కంసాదులవధ చేయుదునన్నందున కృష్ణుడే యని
స్పష్టమగుచున్నది. ఈ యవతార పట్టిక లో హంసావతార మెక్కుడుగా
నున్నది. వామనపూజలో ఈ క్రింది శ్లోకము కనబడుచున్నది:
మత్స్యం కూర్మంచ వారాహం నారసింహంచ వామనం
రామం రామం రామకృష్ణం బౌద్ధం కల్కిం నమామ్యహమ్.
ఇచ్చట ముగ్గురు రాములు- పరశురాముడు, రఘురాముడు,
బలరాముడు చేరినారు. కృష్ణుడును చేరినాడు. ఈ విధముగా అవతారాల
నిర్ణయము ఇంకను ఏకరూపము దాల్చియుండ లేదు.