పుట:రామమోహన నాటకము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

II. బ్రహ్మశ్రీ వి. పి. రాజుగారు.B.A.

మీరు దయాపూర్వకముగా నొసంగిన రామమోహననాటకముచదివి సంతోషించితిని. స్త్రీలకు,బాలురకు, పాండిత్యము లేనిపామరులకు సహితము బోధపడులాగున మృదుశైలిని భక్తి రసపూరితముగా ఈచిన్నగ్రంథము రచించి భక్తులకృతజ్ఞతకు పాత్రులైతిరి. గొప్ప నాటకములకు; కావలసిన లక్షణములు దీనియందు గొన్ని లోపించి యుండవచ్చును. కాని రామమోహనరాయలవా రుపన్యసించిన తత్వములను పరస్పరసంభాషణరూపమున చక్కగ ముఖ్యాంశములను తేటపరిచి తియ్యనిపలుకులచే మనోహరము గావించిరి.లోకము భిన్నము సిద్ధాంతములు భిన్న ములు. వీటినిగుఱించి వ్రాసిన గ్రంథములు స్థిరములు గావు. కాని భక్తిరసగర్భితములైన పుస్తకములు మాత్రము స్థిరములైయుండును. భక్తిరసముతో నిండిన ఈగ్రంథము తెలుగుభాషను జిరకాలము అలంకరించునని నమ్ముచున్నాను.

R.V.M.G. RamaRow Bahadur

ఇట్లుతమ విధేయుఁడు,

Orphanage,Cocanada,25-11-13.

వి. పి. రాజు.

III. Mrs. Balantrapu Sundara Ramayya Garu,

Dear friend,

Many thanks for your kindness to send me a copy of Ramamohana Natakamu written by you. I have gone through the little interesting book at my leisure hours. Though I do not know much of Telugu literature, my optional being Sanskrit, I make hold to , express my opinion of the book. The style is simple and beautiful; the book is suited to modern tastes al is according to present requirements.

COCANADA.

Your's sincerely,

25th November 13.

Balantrapu Sundara Ramayya.