పుట:రామమోహన నాటకము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

రామమోహన నాటకము.


యున్నారు. ఈసదుద్యమమున నాకుఁ దోడ్పడకై నిన్నుఁ బిలిచితిని.

గు__స్వామి !

గీ. పతికి సత్కార్యములఁ దోడు * పడుట కంటె

సతికి ధన్యతరంబైన * చర్య కలదె?

సీత మొదలగు సాధ్వు లీ * రీతి నడిచి

జననసాఫల్య మొనరించు * కొనిరి కాదె!

కాఁబట్టి మియర్ధాంగి నై నందులకు సార్థకంబుగ నీయుత్తమ

కార్యంబున నాశక్తి కొలంది మీకుఁ దోడ్పడి కృతార్థురాల

నయ్యెదను. స్త్రీజాతియందుఁ దనకుఁ గల గౌరవాధిక్యంబుచే

వారి దురంతచింతలనెల్లఁ దొలంపంబూని నిరంతరంబు

కృషి చేసిన యాపరోపకారపారీణుని పవిత్ర చరిత్రను

బ్రదర్శించుటకుఁ దోడ్పడు సౌభాగ్యంబు నాకుఁ గల్పించి

నందులకు మీకు నే నెంతయును గృతజ్ఞురాలను. నేఁటి

మీపయత్నంబు సభాసదుల కెంతయు సంతృప్తి గ సఫలం

బగును గాక !

సూ__ప్రియా ! అదే సంశయము.

గు__అ ట్లేల సెలవిచ్చెదరు ? మీరు ధర్మాత్ములరు. మీశిక్షలో

మెలఁగినమిశిష్యులందఱును వినయవివేకాదిసద్గుణంబులచే

నలరారుచున్నవారు. చరిత్ర యన్ననో భక్తిరసప్రధాన

మైనది. సభాసదులు నీతిసంపన్ను లైనగుణగ్రహణ