పుట:రామమోహన నాటకము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విన్నపము.




సీ. నాటకకార ర * త్నంబులౌ "షేక్స్పియర్ "

"కాళిదా" సాదుల * గౌరవించి

కవిచక్రవర్తులై * కాలుచుండెడు నట్టి

"వాల్మీకి" మొదలగు * వారిఁ బొగడి

నవ్యభప్రౌఢీ*నాటకమ్ము లొనర్చు.

మహనీయతతిని స * మ్మతి నుతించి

సకలబహ్మాండనా * టక సూత్రధారియా

జగదీశ్వరునకు * సాష్టాంగ మెఱుఁగి

గీ. నన్ను మన్నన సేయు ప్ర * సన్నమూర్తి

రావుకులమణి శ్రీసూర్య * రావు నెన్ని

రామమోహన రాయల * రమ్యచరిత

నాటకమ్ముగఁ గూర్చితి * నవ్య ఫణితి.

క. తప్పులు లేవని చెప్పను

దప్పులు గల వనుచుఁ జెప్పఁ * దప్పులు గలచో

నొప్పులుగఁ దిద్ద వేడె

దప్పొప్పులు దెలియ నేర్చు *తజ్ఞుల నెల్లక్

ఇట్లు విన్నవించు

నజ్జన సేవకుఁడు,

ఆదిపూడి సోమనాథరావు.