ఈ పుట అచ్చుదిద్దబడ్డది
82 రాధికాసాంత్వనము
క. [1]ని న్నెఱుఁగదు త న్నెఱుఁగదు
తన్నుం దనమ ట్టెఱుంగు దామోదరుఁడే
[2]తన్నుండె నిన్ను విడుచు న
[3]టన్న న్మఱి దీని నగరె హాహా జనముల్. 21
క. నిన్నుండే మానిసి యై
నిన్నే వెలి సేయఁ బూనె నెలఁత భళారే
కొన్నంగడిలోపలనే
యన్నన్నా మాఱుబేర మగునే చెలియా. 22
ఆ. ఈఁక తోఁక లేని శ్రీకృష్ణుమాటలు
పొలఁతి నమ్మి నానఁ బోసికొనియెఁ
దగిలెనా తగులును దప్పెనా తప్పును
నాతి వెఱ్ఱివానిచేతిరాయి. 23
తే. కుమ్మరికిఁ జూడ నొకయేడు గుదియ కొక్క
పెట్టటన్నట్టు దీనియెబ్బెట్టుతనము
లెల్ల నిదె తీరు నొకసారి యిటకు శౌరి
వచ్చి నిన్నేల, నిందుకు వగవనేల. 24
వ. అనిన విని రాధావధూరత్నం బి ట్లనియె. 25
తే. కోటిమదనులఁగడవ్రేలిగోట గెలుచు
సుందరాకృతితోడ నానంద మిచ్చు
దివ్యసుందరగోపాలదేవుఁ జూచి
వసుధలోపల వలవనివారు గలరె. 26
తే. దాని నెంతయు నన నేల తలఁచి చూడఁ
దప్పుతంటలకొఱగానిదానవారి