పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౧౦

మరులు రేకెత్తించి…‘గోపపతుల కెల్ల కుసుమశరు’డైన ‘రాజగోపాలమూర్తి’ని వశము చేసుకుని హరికి ప్రాణపదమై స్వైరవిహారం చేస్తూ ఉన్నది.

యశోద తోడబుట్టినవాడు కుంభకుడు. ఆతనికూతురు… ఇళ్లను, కృష్ణునికి యిచ్చి పెళ్లి చేశారు. పిల్ల మేనత్తవద్ద చనువుచేత వ్రేపల్లెలోనే ఉంటూన్నది. ఆమెపోషణకూడా రాధదే…

—ఈ డేరిన తరువాత …ఇళకు మాధవునకీ…ఔపోసన కార్యం జరిగింది. రాధశుశ్రూషలో గడి రిన ఇళ—పసిబాలఅయినా—ప్రౌఢమర్యాదల చవులెరిగిన నాథుణ్ని అనురక్తునిగా చేసుకున్నది.

కొన్నాళ్లకు, భార్యతో కృష్ణుడు అత్తవారింటికి మిధిలకు వెళ్లాడు. రాధ—మొదలు, కృష్ణుడు ఇళతో దాంపత్యంచేస్తూన్న శృంగార భావనే—సవతిమత్సరంపూని—సహించలేకపోయింది… ఇళమీద ఎంతప్రాణమైనా. ఇక ఆతడు కంటికికూడా దూరమై సప్పుడు ఆమె వేదన… వర్ణించడానికి వీలవుతుందా?—

విప్రలంభము భరించలేక …చిలుకను రాయబారమంపింది. అది మిధిలకు రెక్కలమీద వెళ్లి వచ్చి అక్కడి విలాసాలన్నీ అతిశయంగా వర్ణించేసరికి…రాధ తూలిపోయింది…

ఇంతలో కృష్ణుడికి కూడా…రాధను చూడకుండా ఉండటం దుర్భరమై తోచి తిరిగివచ్చేస్తాడు. రాధ, ఆతన్ని చూడగానే ఉక్రోషంకొద్దీ మండిపడి తాచులాగా లేస్తుంది: ఇష్టం వచ్చిన మాటలంటుంది. క్షమను అర్డిస్తూ ఆతడు పదములు అంటబోతే—తంతుంది: చివరకు వలవల ఏడుస్తుంది—ఈ మాదిరిగా నాటకమంతా జరిపి…నాధుని కౌగిలిలో…ఆకులలో పిందెలాగా…అణగి పరవశిల్లి పోతుంది. అక్కడితో—కధకంచికి,…