పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

...కనుక ముత్యాలు.......చిరవాసం చేత సగం ద్రావిడుడైన ఆంధ్రుడే కాని... మహారాష్ట్రుడు ఏలా అవుతాడు?

ముద్దుపళని ... భరతాభినయంలో ప్రావీణ్యం సంపాదించు కుంది... కులమర్యాదక్రమాన. వయసుకాడైన వైష్ణవదేశికుడు . .. ‘తపఃఫలసారుండు’ .... వీరరాఘవుడు - సాహిత్యనేపథ్యము శృంగారించినాడు. ఇక మహారాజు మనసుకు నచ్చడానికి ... ఏమికొదువ?

అయితే: ముద్దుపళని రంగాజీవలె శాస్త్రకాకలదీరిన పాండిత్యధీర కాదు. గొప్పచక్కదనం, అందుకు వన్నె తెచ్చే భరతవిద్య -వీటికి దీటైన సరసత్వం సాహిత్యం అన్నిటినీ మించిన . . మహారాజ భోగానుభవయోగము !....

కృష్ణునికి సాంత్వనోపాయాలు, పదాఘాతబహూకృతులూ - వింతలు కావు. తిమ్మన్న ప్రసిద్ధ -ఉత్పాద్య వస్తువును ...రాయల వారుకూడా, గీర్వాణిలో ముఖరించినారు. ప్రీణనకావ్యములు ముద్దుపళని నాటికి కొత్తలుకావు. కాని, ఆ కధాకలాపమంతా... సత్య మీదుగా నడిచింది.

‘రాధికాసాంత్వనము’ ...ముద్దుపళని రచించే అవసరాన— వీరరాఘవదేశికుడు సలహాయిచ్చి అపుడపుడు సాహాయ్యపడి ఉండ వచ్చును. కాని అతని పాండిత్యానికి ప్రతిభకూ - యీప్రబంధములో విశేషముపని తగులలేదు.

రావిపాటి తిప్పన్న సంస్కృత ‘ప్రేమాభిరామము’ను.... వల్లభరాయడు అనుసరించినట్లు, ముద్దుపళని సాంత్వనకావ్యమునకు ఏవో ఒరవడులు ఉండి ఉండవచ్చును.

...కృష్ణుని, యశోదానందులు. గారాబంగా పెంచుకుంటున్నారు వ్రేపల్లెలో... నందుని చెల్లెలు రాధ. పెంపకములాలనలో