పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 31



తెలిసి యెటు లేలెదో నీకుఁ దెలుపవలెనె
దేవ దక్షిణనాయకాధిపుఁడ వీవు. 112

సీ. కొననాల్కఁ గొని మోవి చెనకి చూతువు గాని
యదరంటఁగా నొక్కి యానఁబోకు
ముద్దుచెక్కులఁ జిన్నిముద్దు లుంతువు గాని
జగిగోటికత్తులఁ జీరఁబోకు
మొనవేళ్ళఁ జనుమొనల్ పుడుకు దింతియ కాని
వగవగ బిగిపట్టు పట్టఁబోకు
రతి కేళి మెల్లమెల్లన సల్పుదువు గాని
దురుసుపైసరములు నెరపఁబోకు
తే. వెఱ్ఱినై తెల్పెదను గాని వెలఁది నీవు
వలపులను మించి గడిదేరి వద్దఁ జేరి
మారుసాములఁ జలపోరి పోరువేళ
నాదుగురికట్లు నిలుచునా నలిననయన. 113

తే. అంచు హరిచేతి కిళ నొప్పగించి రాధ
వత్తు నేఁ గూడ నని చెలి పైఁటఁ బట్ట
వేగ వచ్చెద నని విడిపించుకొనుచుఁ
జనియె మది ఖేదమోదముల్ పెనగొనంగ. 114

వ. ఇట్లమ్మందయాన యమందయానంబునఁ బడుకయిలు వెల్వడి రత్నముద్రికాలంకృతం బైనకేంగేల నొక్కబాలికామణిం జెయ్యానుకొని యవ్వాసుదేవు నెడఁబాసిపోవంజాలనిచిత్తంబుతోన తత్తరపడి యమ్మత్తకాశినులం గని తలు పోర సేయుండను నెపమున తిరిగి తిరిగి చూచుచు రాజసం బవలంబించి యెవ్వరితోడం బలుకక డగ్గుత్తియ నడంపుచుఁ గేళి పూగుత్తు లాఘ్రాణించుపోలిక బెట్టునిట్టూర్పులు నిగుడింపుచుఁ జెందొగలవిందుఁ గనుచందంబున వదనారవిందం బెత్తి కందోయిం గ్రందుకొను బాష్పబిందుబృందంబులఁ జిప్పిలనీక రెప్పల నార్చుచు హరివిరహభరంబునం దాఁకి