22 రాధికాసాంత్వనము
విప్రసువాసినీవితతిచేఁ బాడించి
ననమేనఁ గుంకుమనలుగు లుంచి
చలువగొజ్జఁగినీట జలకంబు లాడించి
తడి యొత్తి కురులార్చి జడ ఘటించి
పస మించు కెంబట్టుపావడ బిగియించి
రంగు చెంగావికోకను [1]గదించి
తే. రవికె దొడిగించి సొమ్ము లలంకరించి
జాజు లెనయించి కల్పముల్ సంఘటించి
యరుఁగుపై నుంచి పాలు పం డ్లలవరించి
క్రోల నిప్పించి చిమ్మిలి గొట్టఁ బంచి. 72
తే. భేరి మొదలగువాద్యము , ల్భోరు[2]కొనఁగ
వరుస నెనయించి చెలికొడిఁబ్రాలుగట్టి
కుంకుమరసంబు కస్తూరి కుసుమములును
బంధుమిత్రాప్తతతి కిచ్చి పంచి రాధ. 73
తే. చాన ని ట్లరపడకింటిలోని కనిచి
మొల్లపూఁబాన్పుపై నత్తమిల్ల నునిచి
దగ్గఱను నింబదళము బెత్తంబు నునిచి
[3]యుగ్మలుల నందు జాగరం బుండఁ బనిచి. 74
తే. మాంత్రికులఁ బిల్చి యిలుచుట్టు మంత్రయంత్ర
తంత్రములఁగూర్చి నల్దెసల్ తప్పిదారి
భూతముల నెందుఁ జొరనీక భూతిఁ జల్లి
కలికిఁ గాపాడెఁ గనురెప్ప గాచినటుల. 75
తే. వేడ్కఁ గావించి మరునాడు పిట్టుఁ బెట్టి
[4]కలశముల నెత్తి సీమసీమలకుఁ దనియఁ
బంచి పంచమదినమునఁ బసపు నూనె
యందఱికిఁ బోసి చెలిని బెండ్లరుఁగు నుంచి. 76