పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20 రాధికాసాంత్వనము

బదపద్మయుగళంబు గదిసి పో కున్న రా
యంచ యంచన మందయాన మెసఁగె
తే. మీరుబహునవశ్రీ ల్చెందినారు గనుక
విన్నవించెద నని తళ్కుబెళ్కు లమరఁ
జేరెనో తెల్ప ననఁ గను ల్చెవులఁ జేరె
రమణి కటు చాలయౌవనారంభ వేళ. 64

తే. [1]గుబ్బగుబ్బలులను ద్రొబ్బి నిబ్బరముగ
గుబ్బెతకు [2]గబ్బిసిబ్బెంపుఁగుబ్బ లుబ్బె
సరసయౌవనమానససరసిలోనఁ
బొడము బంగరునునుదమ్మిమొగ్గ లనఁగ. 65

తే. అరయఁ దనజోడుబయలాయెననెడువంత
చిత్తముననాటనానాఁటఁ జిక్కెఁగౌను
మానహానికి సైతురే మహిని దలఁప
బట్ట గట్టినబలుగుణ వంతు లెల్ల. 66

సీ. వెన్నునిముఖచంద్రబింబంబు కళ దేఱఁ
దరుణిలోచనకుముదంబు లలరె
శౌరికిఁ జికురాంధకారము ల్పెరుఁగంగ
ముకురాస్య నఖరతారకలు వెలసె
వనజాక్షువక్షఃకవాటంబు జిగి మీఱ
బిబ్బోకవతిచనుగుబ్బ లుబ్బె
స్వామికి భుజకల్పశాఖలు బలియంగ
నతనాభికిని బాహులతిక లెనసె
తే. హరికి యౌవనవాసంత మతిశయిల్ల
నాతికిని బికకలకంఠనాద మొదవె
భళిర యిటువంటి యీసతీపతులజాతి
రీతు లమ్మయ్య యని రతిప్రియుఁడు వొగడ.

  1. గబ్బిగుబ్బ [మూ.]
  2. బాలగను గబ్బి [మూ.]