పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 145

బెరుగుచు రాలె ము న్మరుఁడు పేర్చినమల్లియతూపుగుంపు త
ద్గురుశిఖవిస్ఫులింగములఁ గూడుక రాలినలీల దోఁపఁగఁన్. 106

వ. అట్టియదనున మదనజనకుం డామదవతిం జూచి యిట్టు లనియె. 107

సీ. వలుదగుబ్బలగోరువంక లేడవి రాధ
యవి నీ వెఱుంగుదు వంబుజాక్ష
చక్కెరకెమ్మోవి నొక్కు లేడవి రాధ
యవి నీ వెఱుంగుదు వమరవంద్య
మిసిమిఱెప్పలఁ దమ్మరసము లేడవి రాధ
యవి నీ వెఱుంగుదు వాదిదేవ
తగువెన్నుసరిపెనదండ లేడవి రాధ
యువి నీ వెఱుంగుదు వతనుజనక
తే. యనుచు నిరువురు గడిదేరి హవుసుమీఱి
యాని సరిపోరికెమ్మోవు లానఁజేరి
తమి చెలఁగం జీరి యలకేరజములఁదారి
[1]కోరి మరుబారి నలసిరి కొమరు మీఱి. 108

సీ. రమ్యబృందావనారామసీమలయందు
[2]నతులితగోవర్ధనాద్రియందు
సత్ఫథోజ్జ్వలరత్నసౌధాగ్రములయందుఁ
దరణిజాసైకతస్థలములందుఁ
బారిజాతలతాంతపర్యంకములయందు
బహుచిత్రకేళికాగృహములందు

  1. కూడి మరుకేళిసలిపిరి కోప మారి. [మూ.]
  2. స్వచ్ఛోదకాపూర్ణసరసులందు. [మూ.]