పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 125

చ. హరిహరి రామరామ యిటు లారడి సేతురె దోసకారి హా
కరఁగినదోసపం డినుపకట్లకుఁ దాళునె చాలు చాలు నా
సరినెరజాణ లాగడము సల్పఁగ మారునిపోరఁ దారి నీ
చిరదయ నేలవే యనుచుఁ జేరితి నే నిపు డంగనామణీ. 24

చ. ననుఁ గరుణించవే పిలువ నంపవె కౌఁగిట గారవించవే
ఘనత ఘటించవే చెలిమి గాంచెవె నాపలు కాదరించవే
నెనరు గణించవే ముదము నించవె యెంచవె యేల నాపయిం
గినుక [1]నడంపవే తెలియ కే నిను వేడెద రాధికామణీ. 25

ఉ. చక్కనిదాన వంచు రతిసార మెఱింగినదాన వంచు నా
యక్కఱ దీర్తు వంచు నను హాయిగఁ గౌఁగిటఁ జేర్తు వంచు నే
నిక్కము నమ్మి వచ్చునెడ నీ విపు డీమటుమాయలాండ్రచే
నక్కట యెప్పగించి యిటు లారడి సేతురె రాధికామణీ. 26

క. అని యావాహనము విస
ర్జనమును లే కున్నఁ జూచి శౌరి శుకంబే
పెనవెట్టిన దీపని యని
యనియెం జెలిచిలుక నెంచి యమృతము లొలుకన్. 27

క. చిలుకా నీకును నాపై
నలుకా పలు కాదరించి యమృతము లొలుకం
బలుకుచు ముద్దులు చిలుకుచుఁ
గులుకుచు నిటు రమ్ము ప్రేమ గొనకొని నాపై. 28

చ. అన విని చిల్క యుల్కిపడి యాహరి చీరఁగ నూరకుండుటల్
దనకును మేర గా దనుచుఁ దద్దయు రాధకుఁ దెల్పి ఘల్లుఘ
ల్లని నునుమువ్వలందియలు నంఘ్రుల మ్రోయఁగ రెక్క లార్పుచుం
గొనబుజవాదివాసనలు గుప్పున వీవఁగ వచ్చి యచ్చటన్. 29

సీ. నెరివెండ్రుకలవాని నిగలొందుతొగవిందు
వగఁ జెందుముద్దునెమ్మొగమువాని

  1. జనింపఁగాఁ దెలియ. [మూ.]