పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5



ముద్దుపళని


ఈమెను గూర్చి మ॥రా॥శ్రీ కందుకూరి వీరేశలింగముపంతులవారు తమయాంధ్రకవులచరిత్రములో వ్రాయించిన పఙ్క్తులు కొన్ని యవసరమునుబట్టి యిం దుదాహరించుచున్నాను. “ముద్దుపళని పద్యకావ్యములు చేసిన స్త్రీలలో నొకతె. ఈముద్దుపళని వేశ్యాంగన. ఇది రాధికాసాంత్వన మను నాలుగాశ్వాసముల శృంగారప్రబంధమును రచించెను. దీనితల్లి పేరు ముత్యాలు. అది తంజాపూరు సంస్థాన ప్రభు వయిన ప్రతాపసింహుని యుంపుడుకత్తె యయినట్లు…గద్యములో వ్రాయఁబడినదానినిబట్టి యూహింపఁ దగియున్నది. దీనికే ఇళాదేవీయ మనునామాంతరము గలదు” అని యున్నది. ఇందు "తల్లి పేరు ముత్యా లనియు, గద్యములో వ్రాయఁబడినదానినిబట్టి యూహింపదగియున్నది" అనియు వ్రాయుటచే శ్రీపంతులవారుకూడఁ బీఠికను జూచినట్టు గన్పట్టదు. పీఠికలోఁ గవయిత్రి వంశవర్ణనము గలదు. ముత్యా లనునతఁడు పళనికిఁ దండ్రి. “ముద్దు” అనునది యుపనామము. పళని యనఁగా దక్షిణదేశములోని సుబహణ్యస్వామి వేంచేసియున్న దివ్యస్థలమునకుఁ బేరు. చాలచోట్ల బిడ్డలకు దేవస్థలముల పేరులే యుంచుచుండుట వాడుక యున్నది. ఈ ప్రబంధములో యశోదకు మేనగోడలును శ్రీకృష్ణునికి భార్యయు నగు నిళాదేవిచరిత్ర ముండుటచే దీని కిళాదేవీయ మను నామాంతరము వచ్చినది.

“ఇది సంగీతసాహిత్యభరతశాస్త్రములలోఁ బ్రవీణురాలైనట్టు తానే చెప్పుకొన్నది. దీని కవిత్వము నాతికఠినమై మృదువుగా నుండినందుకు సందేహము లేదు. దీనికి మంచి సంస్కృతాంధ్ర