పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 119

మందలించి కదళించిన కౌతుకంబున నిళాదేవిం దోడ్కొనిరమ్మని తగువారల నియమించి బయలు మెరసి తన్ను వెంబడించి వచ్చుబంధుజనంబుల బహూకరించి పంచి కనకరథం బారోహించి మించినవేగంబునం జని చని మునిజనబృందావనం బగుబృందావనంబుఁ జేర నరుగుదెంచి రథంబు డిగ్గి నిజమందిరంబుఁ బ్రవేశించి యందు నందయశోదలగురించి నమస్కరించిన వారును గాఢాలింగనంబు లాచరించి దీవించిన ముదంబు వహించి యొక్క సంకేతస్థలంబుస కేతెంచి శ్రీదామనామధేయునిచే గురంగనయన తెఱంగుమఱుంగు లేక యాలించి దిటంబు చాలించి యిందు కేమిసేయువాడ నని యూహించి నేఁ బోయినం గాని రా నోప దని నిశ్చయించి యప్పగ లెల్ల నొక్కలాగున వేగించి యర్ధరాత్రంబునం బయలుదేరి తేటయై జగం బెల్ల నల్లిబిల్లిగా నల్లుకొని జాబిల్లి మొల్లమిగా వెల్లివిరిసినబొండుమల్లియలనుల్లసిల్లునిండుపండువెన్నెలలు గాయ రాధికాసుందరాంగీమందిరాభిముఖుండై చనుసమయంబున. 3

సీ. ఏడఁబోయెద విందు నాడి పొమ్మని పల్కు
నింతులపైఁ గన్ను లెఱ్ఱఁ బెట్టుఁ
బోనీము మముఁ గూడి పొ మ్మని యరికట్టు
చిన్నికన్నెలఁ బెడచేతఁ గొట్టు
నేఁ గూడ వచ్చెద నిలు నిలు మని చేరు
చంచలాక్షుల నదలించి నెట్టు
నామీఁదియాన యిందాఁక రమ్మని పిల్చు
భామినీమణుల నేమేమొ తిట్టు
తే. విఱిగె నిఁక నేల పోవద్దు వీడె మరులు
మాను మని లోకు లిటువంటిమాట లాడఁ
దడ వుపశ్రుతు లని చాల తత్తరించు
రాధపై బాళి గొని యదురాజమౌళి. 4

తే. ఇటులఁ జనుదెంచుహరిరాక యెఱిఁగి చిలుక
చెప్ప విని రాధ తనయొద్దిచెలులఁ బిలిచి