ఈ పుట అచ్చుదిద్దబడ్డది
(ఇళాదేవీయ మనునామాంతరముగల)
రాధికాసాంత్వనము
చతుర్థాశ్వాసము
శ్రీగీతాలసమానా
భోగీంద్రశయాన విహగపుంగవయానా
వాగీశనుతాఖ్యానా
యోగీశ్వర చిన్నికృష్ణ యోగనిధానా. 1
తే. అవధరింపుము దేవ దివ్యానుభావ
వ్యాసమునిసూతి జనకభూవరునిఁ జూచి
చొక్కటపుజీనిచక్కెరయుక్కెరలకు
లెక్క యై మించునుడిచవులెక్కఁ బలికె. 2
వ. అంత ననంతుండు దురంతకంతుసంతాపచింతాభరం బంతరంగంబున మఱుంగుపఱచుకొని కాల్యకరణీయంబు లాచరించి షడ్రససంపన్నంబయినయన్నం బొకయన్నుదలమిన్న వడ్డింప నారగించి గంధోదకంబుచే గండూషించి ప్రక్షాళితపాణిపాదుండై యాచమించి దివ్యాంబరాభరణగంధమాల్యాదుల ధరించి యత్తమామలకడ కేతెంచి నమస్కరించి వారిచే మన్ననలు గాంచి నే వచ్చి బహుదినంబులాయెం బోయిరావలయు నని