పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106 రాధికాసాంత్వనము

చ. నిదు రిఁకఁ జాలు లెమ్మనిన నే శయనింపఁగఁ గల్కి యల్కచేఁ
బదరుచు లేచి యవ్వలను బైఁటచెఱం గిడి పవ్వళింప నేఁ
బదములు వ్రాలఁ దన్నెనట బల్మిని నేఁ గలియంగ శయ్యపై
పదలినకీలుబొమ్మవలె వ్రాలిన దప్పటి దిప్పుడై తగన్. 124

సీ. ముద్దువెట్టఁగ వద్దు ముదిత! యెంగి లటన్న
మొనసి చెక్కిలి గొట్టి మోవినొక్కు-
సుద్దిగా నున్నాను సుదతి! ముట్టకు మన్న
గబ్బిగుబ్బలఁ గ్రుమ్మి కౌఁగిలించు
నబల! పైఁ బడకు మర్యాద గా దన్నచోఁ
గదిసి పెన్నెరి పట్టి కదిమి తిట్టు
వ్రతము నేఁటికిఁ బ్రక్క నతివ! పండకు మన్నఁ
బైకొని కేళి కుపక్రమించు
తే. మేలు గనిమెచ్చు వాతెర గ్రోలనిచ్చు
ముద్దు గొనవచ్చు సుద్దులఁ బ్రొద్దుపుచ్చు
[1]రమ్య మగుగచ్చు లిడి పునారతుల హెచ్చు
నట్టి చెలిపొందు గాంచ కే నెట్టు లుందు. 125

సీ. ఆంగజజ్వరతాప మాఱదు సఖిముఖ
పూర్ణచంద్రోదయంబుననె కాని
మదనవిదాహంబు మానదు ననబోణి
మోవిపంచామృతంబుననె కాని
స్మరదోష మాఱదు సతిసుగంధవసంత
కుసుమాకరంబు గైకొనినఁ గాని
మన్మథకార్యంబు మానదు జవరాలి
నిటలరాజమృగాంకనియతిఁ గాని
తే. తలఁప వలరాచభూతంబు దలఁగి పోదు
ఘనఘనకచాకచాంజనంబుననె కాని

  1. రమ్యముగవచ్చు దా పునారతుల రెచ్చు [మూ.]