పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

103 రాధికాసాంత్వనము

సీ. అలమి కౌఁగిటఁ గ్రుచ్చి యల్లందులకుఁ జొచ్చి
కాసెలోఁ జెయివేయు కౌశలంబు
నుబికి పెందొడ లెత్తి యొడలు ఝుమ్మన హత్తి
హితవొప్ప నెదురొత్తు లిచ్చువైపు
[1]తళుకు లేఁ గనఁ దగ్గి తమి యుప్పతిల నొగ్గి
ధేనుకబంధంబు నానుజాతి
చివచివఁ బై నెక్కి రవళి హెచ్చఁగ నిక్కి
పుంభావ మొనరింపఁ బూనుసొగసు
తే. తరువుఁ జుట్టినలతకూన హరువు మీఱి
తనువు తనువునఁ బెనఁగొన ననువు దేరి
వలపుతో నాగబంధంబు సలుపుదారి
దానికే కాని మఱి దేనికైనఁ గలదె. 117

చ. పొలతులఁ గూడనో రతులపోహణఁ జూడనొ మేల్మి సేయనో
యలి గెడఁ బాయనో విరహ మందనొ కుందనొ తెల్విఁ జెందనో
యిల తొలి నీవిరాళియుసు నీవెత లీమితి లేనిబాళి నేఁ
గలను నెఱుంగ నేఁ డిదిగొ కంటి నయో! తొగకంటికోసమై. 118

తే. మునుపు నిద్దుర లేదయ్యె ముదిత నెనసి
వెనుక నిద్దుర లే దయ్యె వెలఁదిఁ బాసి
యేమి చెప్పుదు మన్మథస్వామిమాయ
ముంచకయె ముంచె నొంచక యొంచె నౌర. 119

సీ. సొగసులపుట్టిల్లు సొక్కుమందులదీవి
రాజసమ్ములటెంకి రామచిలుక
నెరవన్నెబంగారు విరవాదివిరితీఁగె
కుసుమాస్త్రుచేఢక్క కుల్కులగని
మరునిశాస్త్రపుటీక గురువుపీఠము పులి
గడిగినముత్తెంబు కమలపాణి

  1. తళుకు వె న్గనఁ దగ్గి. [మూ.]