తృతీయాశ్వాసము 83
ననవలెను గాని తెగ నిండదొనకుఁ దీసి
యేయువాఁ డేయ న మ్మేమిసేయుఁ జిలుక. 27
ఆ. నందసుతుఁడు మున్ను నామీఁది ప్రేమచే
నొకటి సేయఁబోయి యొకటి సేయు
[1]అత్త నెత్తిఁ జేతు లంగడిలోఁ గన్ను
లాయె ననుచుఁ జెలియ లరసి నవ్వ. 28
వ. అని మఱియు నారాధావధూటి తనచేటీరత్నంబున కి ట్లనియె. 29
ఆ. తగులుదాఁక మేళ మగపడ్డఁ దాళముల్
గాఁగఁ జేసినట్టికాంత వింత
గట్టు చేరినంతఁ బుట్టివానికి బొమ్మ
గట్టు సామ్య మాయెఁ గదవెచెలియ. 30
సీ. కీరవాణులచేతఁ గీళ్ళాకు లంపితే
శిరసావహించు నో సరసిజాక్షి
నాతి యెవ్వతె యైన నామేర వేఁడితే
కను లెఱ్ఱఁజేయు నోకంబుకంఠి
యెలమి నాకోసర మెంతవారల నైనఁ
దెగనాడఁ దలఁచు నోచిగురుఁబోఁడి
యేఁ జూచి చూడక యేమాటఁ జెప్పిన
జవదాఁట వెఱచు నోసన్నుతాంగి
తే. యేపదార్థంబు లైన నాయెదుటఁ బెట్ట
కెవరికి నొసంగఁబోవఁ డోయిందువదన
చేరి యటు లున్నవిభుఁ డిట్లు చేసె నేని
తిరుగ బ్రతుకాడవలెనఁటే శరదవేణి.
- ↑ అత్తమీఁదఁ గన్ను లంగడిలోఁ జేతు. [మూ]