పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౧౩

కాని, ముద్దుపళని—మహారాజరసికసమ్మానిత కాకపోయినట్లయితే…తెలుగులో—‘రాధికాసాంత్వనము’ వెలువడేది కాదు ....

శృంగారవర్ణనము గర్హ్యమనే వైదికులకు…జవాబు అనవసరము. అనభిజ్ఞులకు విద్యాదానం చేయడం వ్యర్థము. హేయజుగుప్సాకలుషితముకాని శృంగారస్థాయి లేనిది…ప్రకృతి—స్థితికే—మోసం.

‘రాధికా సాంత్వనము’, నిస్సంశయముగా సత్ప్రబంధము. నాయిక లేని బ్రహ్మచారికూటము గనుక—విశాఖదత్తునికృతి అసత్కావ్యములజాబితాలో చేర్చినారు పూర్వలాక్షణికులు అని…మల్లినాధుని స్వారస్యసిద్ధాంతము…

గొప్పకవిత్వధోరణులు లేవు కాని చదివినకొలదీ చవులూరించి ఆలోచనలలో ముంచి ఆనందపారవశ్యము ఆవహింపజేసే రసవత్ కావ్యచిత్రము…‘రాధికాసాంత్వనము’.

రాధఎవరు? చైతన్యసంప్రదాయవైష్ణవసిద్దాంతముల వివరణానికి, వేదాంతానికి ఏమికాని… సందగోపుడికి రాధ అనే చెల్లెలు ఉన్నదని ఆమెకు మేనల్లునితో తగులాటమైనదనీ మొదట ఎవరు కల్పించారో?—జయదేవుడు…యీకధను నమ్మినాడు. సంసారాన్నీ, చేసుకున్న మొగుణ్నీ త్రోసివేవి…కృష్ణుని పెనవైచుకొనిపోయిన ఈ రాధకు…శృంగారసంచారంలో మన గణనప్రకారం—అది భగవద్విషయమైనా—వ్యభిచారదోషము ఉన్నది. మరి ఆ కందులోనూ ఏదో స్వారస్యం ఉండటముచేతనే కాదు ... ఇంతవరకూ ప్రతిహతం కాకుండా దేశమంతా ప్రాకిపోయింది? తెలుగులో—రాధామాధవుల శృంగారలీలలకు ప్రతిభాసిత ఉపోద్ఘాతము—సరసభావుకులకు ఏకై క అవలంబనము. ‘కరివేల్పుశతకము’—ఎవరి కావ్యాత్మ—ఆరచనలో