Jump to content

పుట:రాధామాధవము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వినోదార్థము పై ప్రశ్నము లడుగఁబడి, పైరీతి నాయాపద్యములను జెప్పియుండును.)

ఇవ్విషయములనుబట్టి యీతఁడు, కృష్ణరాయల యంతిమదివసములయందు దదాస్థానకవీంద్రుఁడుగాఁ బరిగణింపఁబడినట్లును, ఆరాజదేవేంద్రుని యాదరానుగ్రహములచే విజయనగరరాజధానీవాస్తవ్యుఁ డైనట్లును గన్పట్టుచున్నాఁడు. ఈతనినామ మష్టదిగ్గజకవులపట్టికయందు లేకపోవుటచే, నీతఁడు రాయల కడపటి దివసములలోనే తదాస్థానకవిగాఁ జేరినట్లు గ్రహింప నగుచున్నది. ఇఁక నీతఁ డక్కాలమున విజయనగరనివాసుఁడై యుండినట్లు భావించుటకుఁ గల కారణమును దెలిపెదను —

కృష్ణరాయలయనంతరము విజయనగరసామ్రాజ్యమును బరిపాలించిన యచ్యుతదేవరాయల మంత్రివర్యులలో నొక్క డగు నంజయ తిమ్మరుసు[1], మనరాధామాధవకవి, తారకబ్రహ్మరాజకావ్యమును రచియించినాఁ డనియు, దానిని తన యిష్టదైవత మగు శ్రీరామవిభునకుఁ గృతిగా నిప్పింపవలయు ననియు సభవారితోఁ బలికి, యిక్కవిని “సబహుమానంబునం బిలుపించి, యీవిధముగఁ గోరినట్లు ‘తారకబ్రహ్మరాజము'నఁ గలదు —

“గీ.

పరమహితుఁడవు తారకబ్రహ్మరాజ
మను ప్రబంధంబు నీ చెప్పినది మదాత్మ

  1. ఈతఁడు కృష్ణరాయల ప్రధానమంత్రి యగు తిమ్మరుసు కాఁడు.