పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'

శివచరణభక్తివాసనాంచితకదంబ | సతతసత్యవ్రతాలంబ చల్లమాంబ.


శా.

ఆ చల్లాంబ విలాసవైఖరులు భాషాధీశ భోగీశులున్
వాచాప్రౌఢిని బల్కఁజాల రల గీర్వాణాబ్జపత్రాక్షులం
దా చెల్వం బొకయింతయుం గలుగ దిట్లైన యాలేమతో
భూచక్రంబునఁ గల్గు నిందుముఖులం బోల్పంగ నీవౌదురే?


చ.

కలికిపదద్వయంబునకుఁ గ్రక్కుననోడిన వ్రీడఁ గచ్ఛపా
వళి తలఁజూపఁజాలక జవంబున లోతగు నీటిలోఁ బడెం
దలరఁగ నెఱ్ఱతామరలు దట్టపుకాంతికి నోడి తత్పదం
బులఁబడి యెప్పుడున్ వదలిపోక భజించు నహర్నిశంబులన్.


గీ.

సఖియజంఘాయుగంబుతో సాటిరాఁగలదలచి | యెదిరించి యోడి డెందమున బలియు
బీతిచేఁ గాదె పొట్టలు పిగులుచుండు | గలయ గర్భంబు లెల్ల సంగ్రమముతోడ


క.

కరిగమన తొడలతోడుత | సరివోలం దలచి మావిచక్కఁగ నరఁటుల్
పెరిగి జిగి 3తరుగు గాకటు | తరమగునే పిల్లపిల్లతరములఁ దమకున్.


క.

కలికిపిరుందుల కెనఁగాఁ | బులినము లిసుమంత లెటులఁ బోలెడు నొకచోఁ
దులతుల యనుచుండెడు వే | దులఁదులయననేల వానితో సరియగునే.


గీ.

అతివనడలకు నోడి రాయంచమటుము | లరయ నిలువెల్ల వెల్లనై యాత్మలోన
దద్విరోధంబు సాధింపదలఁచికాక | కమలజుని మోవందమి కేమి కారణంబు.


చ.

నిరతరవిక్రమస్నరణచే సముదంచితకుంభికుంభముల్
పరియలు జేసి తల్పిసతక్షణ సేయుమృగేంద్రకోటు లా
గురుకుచసూక్ష్మమధ్యమున కుందగ నోడి యదృశ్యమయ్యెఁగా
కరమ గుహాంతరాళముల నట్టు వసింపఁగ నేల వాటికిన్.


గీ.

లలనవళు లెప్పుడును దారు నిలిచియుండు | నిలుకడ యొకింతయును లేక చలన మొందు
చుండునంచును పలుమారు నుల్లసమున | భంగత యొనర్చు జలధితరంగములకు.


చ.

పొలఁతుక యారుతీరులకుఁ బొందుగ నాభిగుహ న్వసించు స
ల్లలితపయోధరద్వయమిళిద్ఘనలేపనదీవ్యసౌరభం
బల మలయాద్రిశృంగసముదంచితచంచలమందచందనా
నిల మనుచుం బయవ్వెడలి నిల్చిననీలభుజంగమోయనన్.


చ.

చలమునఁ జంద్రుఁ డెంచఁగను జక్కవరాచెలిగుబ్బచన్నులై
పొలుపుగ నుద్భవించి మదిఁ బూనిన సాధ్వసమెల్ల దీర త