పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఆడఁడు స్వప్నంబులందైన నెప్పుడు పాటిఁదప్పి యసత్యభాషణములు
చూడఁ డొక్కెడనైన సురుచిరసౌందర్యవరవధూజనముఖపద్మములను
వీడఁ డెంతటి యవివేకచిత్తులనైన శరణు వేడిన భీతజనవితతుల
నోడఁ డత్యుగ్రరణోర్వీస్థలులనైనఁ జలితుఁడై శాత్రవసంఘములకు
నతఁడు రాజేంద్రమాత్రుఁడే మతిఁ దలంప | నర్థి దారిద్ర్యతిమిరార్కుఁ డమితయశుఁడు
భవ్య శివదేవరాయ భూపాలసుతుఁడు ! భూరివిభవుండు భళ్ళాణభూధవుండు.


గీ.

ధర్మగుణకాండములె చాలఁ దనకుఁ దోడు | గాఁగ నరులను రక్షించు గణనలేక
ధర్మగుణకాండములె చాలఁ దనకుఁ దోడు | గాఁగ నరులను శిక్షించు గణనలేక.


సీ.

అల చందురునియందు గలకందుఁ గని ముందు పలుచందముల సందలలి నొనర్చి
ఘనలీలలను శూలిగళమూలమున నీలమునుబోలు రుచి జాలమును హసించి
తగసీరి పైభూరి తరహారి యగుచీరఁగని సారెకునుఁ గేరివినుతి మీరి
సికవాణియగువాణి పృథువేణిఁ గలపోణి మినిజాణతనమున మించనాడి
కుందమందార విశదారవింద చంద | నేందుమణిహార తారకాహీరవార
ములఁ దిరస్కృతి యొనరించుఁ జలము మిగుల | వరుసతోడుత నమ్మహావరునికీర్తి.


సీ.

కోరినయప్పుడే కురియును వర్షంబు భూమి ఫలించు నద్భుతము గాగ
మొదవులు పాలిచ్చు మూడువేళలయందు విడువక కాచును వృక్షతతులు
నెరి నపమృత్యువు నెఱుఁగ రెవ్వారైనం జోరరుగ్బాధలు సోకుటరిది
జలతృణోపేతమై విలసిల్లు ధారుణి నిత్యోత్సవము లొప్పు నిఖిలదిశల
జనులు కలనైనఁ గలహంబుఁ గనుటలేదు | జాతిభేదంబు దప్పక జరుగుచుండు
జలరుహస్తాన్వయాంభోధిచంద్రుఁ డగుచుఁ | దనరు భళ్ళాణవిభుఁ డేలు ధరణియందు.


గీ.

సతతపుణ్యవ్రతలు గుణోన్నతలు పతికి | హిత లశేషజగజ్జననుతలు భాగ్య
వతులు రూపున మారటరతులు సుమతు | లతులసౌజన్యయుత లిర్వు రతనిసతులు.


గీ.

వారిలోన నగ్రవనజాక్షి చల్లాంబ | మఱియుఁ జిన్నపొలఁతి మల్లికాంబ
సవతు లెరసు లేక సతతంబు మెలఁగుచు | సవతు లేక యుండ్రు సమ్మదమున.


సీ.

కమనీయమేఘలాఘటితభూరినితంబ పోషితాశేషసద్బుధకుటుంబ
సుందరాస్య ప్రభానిందితశశిబింబ మధురోష్ఠవిహసితమహితబింబ
చికురకోమలకాంతిగితమత్తరోలంబ కేవలతరకరుణావలంబ
యానావధానప్రహర్షితకాదంబ నిఖిలపాపౌఘావనీధ్రశంబ
గురుజనానందకరలసద్గుణకదంబ | సేవకాభీలఫలదప్రతిరసాంబ