పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గల కెందమ్మి యటంచుఁ బాదములఁ ద్రొక్కన్ దంతముల్ రాల య
ట్లలరెంగాదె సహస్రపాదుఁ డనుపే రావానరస్వామికిన్.


గీ.

నాగరులు మేన నలందిన నవ్యచంద | నాగరుల సౌరభానలం బానుచున్న
చంచరీకాళుల నయనసరణిఁ బొదలుఁ | బురి వితానాంచలాంచితసురపమణులు.


చ.

మరకతరత్నసంఘటితమానితకుడ్యకదంబజాలకాం
తరములనుండి వేవెడలు తద్ఘనసారపుధూపధూమముల్
పరువడిఁ జూచి నీలఘనపంక్తు లటంచు నటించు నెంతయున్
గుఱుతుగ మేదినీస్థలిని గోర్కెలచే శిఖినీసమూహముల్.


మ.

నెల మద్విటను గోటచాటుఁ జనుచో నీటొప్ప నర్కోపమో
జ్వలపంకేరుహరాగరత్నము రుచివ్యాప్తిం బ్రకాశించు ని
వ్వలిచెంతన్ బరిఘాంతరాంబుజతతల్ వ్యాకోచభావంబుచే
నలరుం బున్నమఱేలు దన్మణిరుచుల్ హంసాళులన్ భ్రాంతిచేన్.


ఉ.

గట్టిగ వెండిబంగరపుగట్టులె యిల్లును విల్లు గాఁగఁ జే
పట్టియు భిక్షకుం దిరుగు భర్గుని దేటివిభూతి యంచుఁ బె
న్గట్టుల మించు విత్తములఁ గ్రక్కున వెచ్చము చేయుచుందు ర
ప్పట్టణమర్త్యసంఘములు భవ్యవిభూతిఁ జెలంగి యెప్పుడున్.


క.

వేడుక నజుతో వాదం | బాడం బులకితాంగు లగుదు రాపురిలోనం
బాడబులు దురితజలనిధి | బాడబులని జగములల్ల బ్రస్తుతిసేయన్.


క.

మారునియాకారముం బలు | మారును నిరసించు రాకుమారులు వీటన్
మారెందు లేక వడిఁ బరి | మారుతు రంవరులఁ దృణముమారుగ నెపుడున్


క.

ధనదుఁడను పేరు మాత్రము | తనకబ్బెం గాక పిలిచి ధన మెవ్వరి కి
చ్చెను యక్షుండంచు నెంచుచు | ధన మిత్తురు బుధులఁ బిలిచి తత్పురివైశ్యుల్.


క.

ధరణీసురాంఘ్రసేవా | నిరతులు శ్రీకంఠభక్తినిపుణులు రిపుకుం
జరనముదయమహర్యక్షులు | సురుచిరయశు లందుఁ గలుగు శూద్రజనంబుల్.


సీ.

వలనొప్ప నీదండవలె నింతి మాకన్న దండ గావలెనేని యుంుకొనుముము
కనుగొనియెద బంతులొనర నిమ్మిపుడన్న గోరంట బంతులఁ గోరుకొనుడు
మారుబేరము లింక మాకెట్లమరు నన్న మరుమాట మేలగు మాయెడలను
నునుమోవిచివురునకు వెల యెంతన్నఁ బ్రియమంచు దీని దీవెనఁగఁదగునె
యనుచుఁ దముఁ జేరు నెఱదంటతనము మీరఁ | పలుకు నల కోడెకాండ్రకుఁ బ్రీతివచనము