పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నొనరించెద నవ్విభునకు | జను లెల్లను బొగడఁదగిన షష్ఠ్యంతంబుల్.


క.

ధీరునకు భక్తజనమం | దారునకు సురారిమదవిదారునకు మహో
దారునకు నఖిలజగదా | ధారునకు నఘౌఘవారిదసమీరునకున్.


క.

సోమునకు రజితభూధర | ధామునకు నుదంచితాహిదామునకు నయో
ద్దామునకుఁ బ్రకటసద్గుణ | దామునకున్ మౌళిశీతధామున కెలమిన్.


క.

భవునకు శోషితసరసిజ | భవునకు నగణితలసద్విభవునకు గౌరీ
ధవునకు వృషభేశ్వరసైం | ధవునకు గిరిబాంధవునకు ధవళాంగునకున్.


క.

శూలికి విమలదయాసం | శీలికి గజదైత్యచర్మచేలికిఁ బురని
ర్మూలికిఁ బరిపాలితదివి | జాళికి నతహృత్పయోరుహాళికి భక్తిన్.


క.

స్థాణునకు నురుచతుర్భుజ | బాణునకు జితప్రసూనబాణునకు బుధ
త్రాణునకు నిరతపోషిత | బాణునకున్ సత్యవాక్యపారీణునకున్.


క.

నరకిన్నరవిద్యాధర | గరుడోరగ సిద్ధసాధ్య గంధర్వసురా
సురపూజితచరణునకును | హరిణాంకనిభప్రకాశుఁడగు పశుపతికిన్.


క.

భృంగిరిటనాట్యరతునకు | సంగరవిజయునకు పాణిసారంగునకున్
గంగాధరునకు నబ్ధిని | నిషంగున కుర్వీరథునకు జగదధిపతికిన్.


క.

యక్షాధీశ్వరసఖునకు | నక్షీణలసత్కృపాకటాక్షునకు గణా
ధ్యక్షప్రియునకు విదళిత | దక్షాధ్వరునకును ధర్మతాత్పర్యునకున్.


క.

హరునకుఁ గాంచనధరణీ | ధరకోచందండునకు మృత్యుదర్పహరున కీ
శ్వరునకుఁ బీఠాపురమం | దిరకుక్కుటలింగమునకు దివ్యాంగునకున్.


వ.

అనంతసాష్టాంగదండప్రణామంబులు సమర్పించి యద్దేవతాసార్వభౌమునకు నంకి
తంబుగఁ దత్కృపాతిశయమున నా యొనర్పం బూనినయట్టి రాజశేఖరవిలాసంబునకుఁ
గథాక్రమం బెట్టిదనిన.


ఉ.

శ్రీకరలీలఁ దొల్లి మునిసింహు లనేకులు నైమిశాటవిం
బ్రాకటరీతి సూతుఁ గని పల్మరు ప్రార్ధనఁ జేసి యెప్పుడున్
లోకములందు యోగిజనలోలుఁ డుమాపతి తత్కథావళుల్
చేకొని పల్కినన్ తిసిసఁవినినఁ జేకురు సౌఖ్యము లెట్టివారికిన్.


సీ.

అసమానఘోరదుఃఖారణ్యములకుఁ బ్రజ్వలితాగ్నికీలలు శంభుకథలు
ఘనతరాఘౌఘాంధకారంబునకు లసజ్జలజాప్తబింబముల్ శంభుకథలు
గాఢామితోగ్రదుష్కర్మోరగములకు నమదమయూరముల్ శంభుకథలు