పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఛందమునుం గావ్యాదుల | చందము నింతైన నెఱుఁగ సతతము విద్వ
ద్బృందంబులకృపఁ గవితా | సందర్భం బొగి నొనర్తు సాహసవృత్తిన్.


చ.

ఎనయఁ బ్రసూనదామ మెవ రేక్రియఁ గూర్చిన నందుఁ గల్గు వా
సనలకుఁ గాదె మానవులు సంతస మందుదు రుర్వి నట్టిపా
వనతరశంభుభర్తయను వాసనకు న్మది మెచ్చి మత్కృతిం
గనుకొని తప్పులెన్నక తగం గరుణింపుఁడు సత్కవీశ్వరుల్.


వ.

అని నిఖిలవిబుధ విబుధ వినుతిం గావించి మఱియు నిష్టదేవతాప్రార్థనంబు జేసెద.


సీ.

శ్రీమద్గిరీంద్రజాచిత్తసరోహంస హంససహస్రదివ్యప్రతాప
తాపసానేకసంతవరక్ష శోణాధ్యక్ష యక్షేశనఖ దక్షయాగహరణ
రణరంగరిపునాశ రజతాచలనివాస వాసవార్చితవాదవనజయుగళ
గళమూలభూషణలలితహాలాహల హలధరానుజసన్నుతార్జునాంగ
యంగసంఘాతమధనసత్యప్రచార | చారణామరపోషణసతతవిభవ
భవవిరూపాక్షయోగిహృత్యద్యపీఠ | వీకపురికుక్కుటేశ కిల్బిషవినాశ.

సర్వలఘుసీసము.

తరుణశశిభరణ సువితరణ భయహరణకర యరుణసరసిరుహనిభచరణయుగళ
మదనమదమధన ఘనకదనతలవిజయ గిరిసదన జగదవన కరివదనజనక
వనజభవదమన పురదనుజకులశమన మునిమనజలురవరద ప్రతిదినవిలసిత
బహువితరవిభవ రిపుగహనదవదహన పటువిహగపతిగమననుత మహితచరిత
ధరణిరథ తరణిశతసదృశ హరత్రినయన | గరళగళ ధనదసఖ శుభద గగనచికుర
వరసుగుణనికర మృదుహృదయ శరధిశరథి | యురగవరచరణ పరమపురుష గిరిశ.


క.

దుర్గాధినాథ దివిజని | వర్గార్చితమృదులపాద వనరుహయుగళా
గర్గాదిమౌనిసన్నుత | భర్గా శ్రీకుక్కుటేశ భవ్యవిలాసా.


చ.

విను మఖిలేశ మర్త్యులకు వేడుకఁ గావ్య మొసంగి ధాత్రిపై
నొనరఁగ సౌఖ్యసంపదల నుద్ధతులై సుకవీంద్రు లుందురా
ర్యనికరవంద్య నీవిహపరంబుల సౌఖ్య మొసంగు సామివం
చును మది నెంచి నీకు సరసుల్ విని మెచ్చఁ బ్రబంధ మిచ్చెదన్.


గీ

తప్పులున్నయెడల నొప్పులుగా నెంచి | పూని కావ్య మొనరఁ బూర్తి చేసి
కరుణ మీఱ మాకుఁ గామితార్థము లెల్ల | ఘనత నొసగి యేలుకొను గిరీశ.


క.

అని విన్నవించి యాతని | ఘనతరకరుణావిశేషగౌరవముననే