పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

ప్రథమాశ్వాసము


వలనుగఁ జూచి గొప్పలుగ వండిన యుండ్రములంచు భ్రాంతి లో
పల జనియించి తుండమునఁ బట్టి మరిం దివియంగఁ జూచు వి
ద్యలగురుఁ డేకదంతుఁడు ముదంబున మత్కృతి బ్రోచుఁ గావుతన్.


చ.

రవి శుక్ర ధౌమ సౌమ్య సురరాడ్గురు భార్గవమంచు రాహుకే
తువులనఁ బేరు గల్గి యల తోయజగర్భసురేంద్రముఖ్యులౌ
దివిజుల కెల్లకోరిక లతిస్థిరమానసులై యొసంగుచుం
భువిని ప్రబుద్ధులైన గ్రహముల్ మముఁ బ్రోతురు గావుతం గృపన్.


సీ.

కచశైవలంబులఁ గటిసైకతంబులఁ గొమరారు వక్షోజకోకములను
లాలితబాహుమృణాలనాళంబుల నిరుపమలోచనేందీవరములఁ
గమనీయపాదకల్హారదళముల మానైన దరహాసఫేనములను
బంధురకరతలపంకేరుహంబుల వరవళివీచికావ్రాతములను
భాసిలుచునుండు గిరిజానివాససరసి | నమరఁ గ్రీడించు గిరీశహంసము మదీయ
దురితనీరంబు దిగనాడి నెరిని సుకృత | దుగ్ధములఁ గైకొనండుఁ గాఁతఁ దూర్ణగతిని.


సీ.

ఆకాంతవిదితపుణ్యశ్లోకు వాల్మీకు నఖిలశాస్త్రాగమాభ్యాసు వ్యాసు
భాసురకవితాప్రభవభూతి భవభూతిఁ జారుతరాతి యశోరుఁ జోరు
వీరాధిభుజామయూరు మయూరుని బంధురనవపుష్పబాణు బాణు
నసమవిద్వన్మనోహర్షుని శ్రీహర్షు సారవాక్యక్రియాశ్లాఘు మాఘు
కలితవిద్యాసముల్లాసుఁ గాళిదాసు | బుధజనానందకరముఖాంభోజు భోజు
మఱియు గీర్వాణకావ్యనిర్మాణచతురు | లగుకవీంద్రులఁ బ్రార్థింతు నగణితముగ.


మ.

రమణన్ నన్నయభట్టుం దిక్కమఖి నెఱాప్రగ్గడ న్భాస్కరుం
గ్రమ మింపొందఁగఁ బోతనాహ్వయుని లోకఖ్యాతుఁడౌ జిమ్మపూ
డమరేశున్ ఘనభీమసత్కవిని రథ్యంబొప్ప శ్రీనాథము
ఖ్యమహాంధ్రాంచితకావ్యకల్పకుల నేఁ బ్రార్థింతు నెల్లప్పుడున్.


సీ.

గురుతరకౌండిన్యగోత్రవిఖ్యాతుండు బయ్యనామాత్యుఁ డేప్రభునితాత
నిరతాన్నదానవర్ణితయశస్సాంద్రుండు తిమ్మనసచివుఁ డేధీరుతండ్రి
ఘనులు జగ్గనయు సింగన్నయు నరసన్నయను మువ్వు రేమంత్రి యనుఁగుఁదమ్ము
లలరఁ దిమ్మన్న రాజన్న జగ్గన్నయు సూరన్న యేమంత్రిసుతవరేణ్యు
లొనర వీరమ పాప మేఘనుని సహజ | లతిపతివ్రత లక్ష్మి యేచతురు రాణి
యట్టి శ్రీకూచిమంచి వంశాబ్ధిచంద్రు | మజ్జనకు నల గంగనామాత్యుఁ దలతు.