పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

నియ్యోగి బ్రాహ్మణుఁడు. కృష్ణమాంబా కుమారుడు. మంతియు, దండనాథుడును. ఈతడు శ్రీకృష్ణ దేవరాయని మంత్రియైన తిమ్మరుసుమంత్రికి అల్లుడు. ఈ అప్పామాత్యుఁడు తిమ్మరుసుమంత్రి కూతురు తిరుమలాంబను వివాహమాడిన ట్లీపద్యములలో వర్ణించెను.

సీ. ఏమంత్రిమణి నిజస్వామికార్యక్రియాతత్పరమానసోత్సాహశాలి
     యేమంత్రిమణి మిత్రహితబాంధవాశ్రితప్రకరరక్షణకళాప్రౌఢబుద్ధి
     యేమంత్రిమణి వచోహేలాతినైర్మల్యశీతలతాధూతశీతరోచి
     యేమంత్రిమణి సుధాధామశాంభవధామధాళధళ్యసుతుల్యధవళకీర్తి
గీ. యట్టి మంత్రికులోత్తంస మహితనృపతి, పటలమకుటాగ్రఘటితపత్పద్మయుగళి
     సకలకర్ణాటరక్షోవిచక్షణుండు, దీనసురశాఖి సాళువతిమ్మమంత్రి

గీ. అమ్మహామంత్రి కతనియర్ధాంగలక్ష్మి, సకలపుణ్యాంగనాజనశ్లాఘనీయ
     లక్ష్మమాంబకు నుదయించి లలిని మెఱయు, తిరుమలాంబికఁ బెండ్లియై తేజరిల్లె.

కావున నీకవి శ్రీకృష్ణ దేవరాయలకాలము అనగా 1540 సంవత్సరప్రాంతమున నుండెననుట నిర్వివాదము.

కవితాశైలి దెలియుట కీక్రిందిపద్యము లుదాహరింపబడుచున్నవి.

ఉ. చెప్పిడి దేమి నవ్వుచు రచించినమాటలు రాము బాణముల్
     దప్పినఁ దప్పఁ డాశ్రితకలాపము ముంగిటనున్న వేలుపుం
     దిప్ప వివేకశాలి యువతీజనచిత్తవినూత్నదర్శకుం
     డప్పనమంత్రి వానిఁ దరమా నుతియింప నిలింపకోటికిన్.

ఉ. రాహువుఁగాను నిన్నరగ రాచిన శూలినిగాను నీతను
     ద్రోహము చేసినట్టి యలరోహిణి తండ్రిని గాను దజ్జగ
     న్మోహిని నీలనీలకచ ముద్దులచక్కెరబొమ్మఁ గూర్ప క
     య్యో! హరిణాంకతావకమయూఖముఖంబుల నేచ నేటికిన్.

మ. కటిశాటీభవదేణకృత్తితనుజాగ్రన్నాకులేకాగ్రదృ
     క్పుటి లాలాటసమర్పితాంజలి రమాంభోజాననానాయకో