Jump to content

పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3


గీ॥ అల్లసానివాని యల్లిక బిగిసోంపు ముక్కు తిమ్మనార్యు ముద్దుపలకు పాండురంగ విభుని పద్యం హరువును కాకమానిరాయ నీకెకలదు.

అని తనను గూర్చి శ్రీరంగనాధుడు పల్కినట్టు లీకని తన పొంచాలి పరిణయములో జెప్పుకొనెను. అల్లసాని పెద్దన్న 1535 వఱకును, ముక్కు తిమ్మన్న 1526 ఇఱకును. పాండురంగ మహాత్మ్యమును రచించిన రామకృష్ణుడు గూడ కృష్ణదేవరాయల యవసాన కాలము నాటికి చిన్న వాడైయుండి యుండవచ్చును.

ఈతని కవిశ్వమును గూర్చి పై ముగ్గురి కవిత్వములోని గుణము లున్నదనుటచేత నీ కవియం, వారి తరువాత 1570-80 ప్రాంతముల యందే యున్న వాడని యూహించవచ్చును.

కాకమానీ మహా గ్రామాబ్జ మిత్రుడని చెప్పుట చేతను, పరస విద్వత్కవి సార్వభౌముడని చెప్పుకొనుటచేతను, నీకవియా యూరిలో గౌరవ జీవనముగల ప్రసిద్ధుడై యుండును. శివదేవరాయల యనంతరము విద్వత్కవి పోషకులగు రాజుల స్తమించుటచేతను, అర్హులగు కృతినాధులు లేని కారణమునను, నరకృతి యందిష్టములేక పోవుటచేతను గూడ నీతడు తన కృతులను నరాంకికము గావించి యుండడు,

కథా సంగ్రహము. (ప్రథమాశ్వాసము.)

కథా సంగ్రహమును విశదీకరించిన పిమ్మట కభేతి వృత్తమును విమర్శించుట సమంజసము గదా !

మగధదేశమున కుసుమపురము గలదు. అది శత్రుదుర్నిరీక్ష మై లక్ష్మీవంతమై రత్న ప్రభలచే చీకటిలేనిదిగా తనరారు చుండెను.

అచటి బ్రాహ్మణులు నలుమొగముల బ్రహ్మవలె దిక్కులు జూడక నేరముఖముగా వేదపాఠమును జదువుదురు. రాజులు భారవుని తమ కొలువునకు రప్పింపగల సమర్థులు. వైశ్యులు విత్యైశ్వర్య