| | మందెడుసమయంబునం దాటకాకుమా | |
| ఆ. | గడఁక చాలక కడుఁ గలఁగెడు తాపస | 19 |
రామ. ఇమ్మాడ్కిని, అయ్యన్నదమ్ములు = ఆరామలక్ష్మణులు, అపాపలవ = పాపలేశరహితులైన, ఆర్య = పెద్దలయొక్క, ఖేలలన్ = విహారములచేత, అతివ్యాప్తమైన, ఆసవనక్షోణియందు = ఆయజ్ఞభూమియందు, సరసులగరిడిన్ = రసికుల వెంబడిని, ఇష్ట, పురాణపరిచితిన్ = పురాణశ్రవణమువలన, ప్రియమందెడు సమయంబున, తాటకాకుమారులు = సుబాహుమారీచులు, అలోల = చలింపని, సద్బల = మంచిసేనయొక్క, భీమ = భయంకరమైన, తారాసరణిన్ = ఆకాశమున, మెలంగఁగా, తాపసనాథ = విశ్వామిత్రునియొక్క, హృదయవర్తనంబు తేర్చి, బాఢకలిత = మిక్కిలిఁ జేయఁబడిన, సుయోధ = శూరులయొక్క, నాదులు = సింహనాదముగలవారనుట, కలితప్రారంభులైరని ముందటిపద్యములోఁ గ్రియ.
భారత. ఇమ్మాడ్కిని, అన్నదమ్ములపాపలు = కౌరవపాండవులు, అవార్య = విశృంఖలమైన, ఖేలలన్ = విహారములయందు, ఆసన్ = అపేక్షచేత, వనక్షోణియందున్ = ఉద్యానవనభూమియందును, సరసులన్ = కొలఁకులయందును, గరిడియందును, ఇష్టపురాణ = వేడుకయొక్క, పరిచితిన్ = ఎడతెగమిచేత, సమయంబునందు, ఆటకు నాకుమారుల లోలసద్బలనిరూఢిచేత, భీమోద్ధతి = భీముని యౌద్ధత్యము, ప్రబలంగ, తారు = తాము, ఆసరణిన్ = ఆరీతిని, మెలంగ, కడఁక = ధైర్యము, చాలక, తాపసనాథ = విచారయుక్తమైన, హృదయవర్తనంబు తేర్చి, బాధ = సంహరించెదమనెడి ప్రతిజ్ఞచేత, 'భృశప్రతిజ్ఞ యోర్బాఢ” మని అ. కలిత = కూడిన, సుయోధనాదులు = దుర్యోధనాదులు.
| మ. | అసమామ్నాయనయాధ్వరక్షణవిభూతాపాదియై మించురా | 20 |