Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెల్లాటములచేత, పక్త్రిమ = పరిపక్వమైన, సౌభాగ్య = ఒప్పిదమును, ధురీణ = వహించిన, తన్మహి = ఆతపోవనభూమియందున్న, మహర్షి = మునీశ్వరులయొక్క, స్వాంత = మనస్సులయొక్క, లీలా = ఉల్లాసమునకు, ఉచిత = తగిన, ఉత్తమసంక్రీడల నొనర్చిరి, ఆత్మజ్ఞ = బ్రహ్మణ్యులతోడనైన, అతిసఖ్యాఢ్యులై.

భారత. అమిత, ప్రౌఢిగన్ = ప్రౌఢి యగునట్టుగా, ధార్మిక = ధర్మాతుఁడైన, అగ్రియపితృవ్య = పెదతండ్రి యైనధృతరాష్ట్రునిచేత, “పితృభ్రాతా పితృవ్యస్స్యా" త్తని అ. ఆదిష్ట = ఉపదిష్టమైన, వృత్తిని, శాంతనవ = భీష్మునియొక్క, సత్త్వశ్రీ = బలసంపదయొక్క, తన్మహిమ = ఆధృతరాష్ట్రునియైశ్వర్యముచేత, హర్షి = సంతోషముగల, ఆత్మజ్ఞాతి = దుర్యోధనాదులతోడ నైన, కడమ సరి.

శా.

శశ్వద్విస్ఫురితస్వబాహుబలభీష్మప్రౌఢచాపక్రియల్
విశ్వామిత్రవితానవిఘ్నభయవిశ్లేషం బొనర్పన్ జగ
ద్విశ్వాస్యస్థితిఁ జాలి యున్కి నటు లవ్వీరార్భకుల్ గాంచి ర
త్యైశ్వర్యాహమికావిశృంఖలవిహారారంభవిస్రంభముల్.

18

భారత. భీష్మునియొక్క, విశ్వ = సమస్తమైన, అమిత్ర = శత్రువులయొక్క, వితాన = సమూహముచేత నైన, అవ్వీరార్భకుల్ = కౌరవపాండవులు, ఆత్యైశ్వర్యమును, అహమికా = పరస్పరాతిశయాహంకారమును, విశృంఖలవిహారములను, ఆరంభములయందుఁ గల, విస్రంభములు = విశ్వాసములను, “సమా విస్రంభవిశ్వాసౌ” అని అ. సిద్ధఫలములైన యుద్యోగములను ననుట, కాంచిరి.

రామ. స్వబాహుబలముచేత, భీష్మ = భయంకరములైన, ప్రౌఢచాపక్రియలు, విశ్వామిత్రునియొక్క, వితాన = యజ్ఞముయొక్క, “క్రతువిస్తారయోరస్త్రీ వితానం త్రిషు తూచ్చకే" అని అ. అవ్వీరార్భకుల్ = ఆరామలక్ష్మణులు, అత్యైశ్వర్య = ఈశ్వరకృత్యము నతిక్రమించిన, "అత్యాదయః క్రాంతాద్యర్థే ద్వితీయయా” అని ద్వితీయాతత్పురుషము. ఐశ్వర్యశబ్దము "గుణవచన బ్రాహ్మణాదిభ్యః ష్యఞ్” అని కర్మధారయమందలి ష్యఞ్ప్రత్యయాంతము. అహమికా = అహంకారముచేత, విశృంఖల = అనివారితములైన, విహారారంభ = క్రీడోద్యోగములయందుఁ గల, విస్రంభములు = అసంకోచవృత్తుల ననుట, కాంచిరి.

సీ.

ఇమ్మాడ్కి నయ్యన్నదమ్ములపాపల
            వార్యఖేలల నతివ్యాప్తమైన
యాసవనక్షోణియందును సరసుల
            గరిడి నిష్టపురాణపరిచితిఁ బ్రియ