| | సలిపి రెల్లప్రొద్దు సన్మానసస్థితిఁ | 16 |
భారత. తమ, ఆనగరంబు = ఆహస్తినగరమును, ప్రవేశించి, అస్ర = కన్నీ ళ్లనెడి, పయోధులన్ = సముద్రములను, “అస్రమశ్రుణి శోణితే” అని అ. అంబకంబులన్ = నేత్రములయందు, “అంబకం నేత్రశరయోః" అని వి. ఆఁగి, తత్ = ఆవ్యధచేతనైన, మహాశ్రమ = అధికమైన బడలికగల, శోక = ఖేదముయొక్క, దైన్యముయొక్కయు, భరమున్ = అతిశయమును, “భరో౽తిశయభారయోః” అని వి. హరియించుటకు, తమ, కురువృద్ధులు = భీష్మాదులు, ఒసఁగెడు, బహుళతాప = ఆధికపరితాపముతోడ, సహిత = కూడిన, భాషితములను, నెనరుదొరలు = నెనరులు గలరాజులు, గౌరవములు = పూజలను, ఒనర్పఁ గైకొంచు, పితృవియోగచింతన్ = పాండురాజు పోయినవిచారమును, ప్రిదిలి = విడిచి, సన్మానసస్థితిన్ = మంచిమనోవ్యాపారముచేత, ధార్తరాష్ట్ర = దుర్యోధనాదులయొక్క, లీలఁ దగిలి క్రీడ సలిపిరి.
రామ. ఆరీతిఁ జని, తమయాన = తమయాజ్ఞ, “ఆజ్ఞప్తి యానతి యాజ్ఞ యాస”యని యాంధ్రభాషాభూషణమందుఁ దద్భవములలోఁ జెప్పినది. అస్రప = రాక్షసులైన, యోధులన్ = వీరులను, అంబకంబులన్ = బాణముల చేత, ఆఁగి = వారించి, తత్ = ఆవిశ్వామిత్రునియొక్క, మహాశ్రమ = తపోవనమందుఁగల, తమకు, ఉరువృద్ధులు = అభివృద్ధులను, ఒసఁగెడు బహుళతాపసులయొక్క, హితభాషితముల = ప్రియోక్తులయందుఁగల, దీవెనలను జేకొనుచు, వెండియున్ = మఱియు, నెనరుదొరలు = ప్రియము గూఱిన, గౌరవములను, ఒనర్పన్ = మునీశ్వరులు చేయఁగా, సత్ = సత్పురుషులయొక్క, మానస = మన స్సనెడి మానససరస్సునందుఁ గల, శ్లిష్టరూపకము. “సీతాంశువర్ణై ర్వయతి స్మ తద్గుణైః” అని నైషధప్రయోగము. స్థితిన్ = వర్తనచేత, ధార్తరాష్ట్రలీల = హంససామ్యమును "ధార్తరాష్ట్రా స్సితేతరైః” అని అ. తగిలి క్రీడ సలిపిరి.
| మ. | అమితప్రౌఢిగధార్మికాగ్రియపితృవ్యాదిష్టవృత్తిన్ మహో | 17 |
రామ. అమితప్రౌఢిని, గ = పొందినవాఁడునై, ధార్మిక = విలుకాండ్రలోపల, అగ్రియ = శ్రేష్ఠుఁడైన, "పరార్థ్యాగ్రప్రాగ్రహరప్రాగ్రాగ్ర్యాగ్రీయమగ్రియ" మని అ. పితృ = దశరథునిచేత, వ్యాదిష్ట = ఆజ్ఞాపింపఁబడిన, వృత్తి = వర్తనను, గ్రహియించి, శాంత = పరస్పరవిరోధము లేనివియు, నవ = ప్రాయపువియు నైన, సత్త్వ = సింహాదిమృగములయొక్క, శ్రీ = సమృద్ధియొక్క, సమూహముయొక్క యనుట, చమత్కార =