రాజువెంటను, మాన్చి, ప్రేమ = ప్రియముచేత, అత్యలఘు = మిక్కిలి నధికమైన, శ్రేయః = పుణ్యమునకు, "స్యాద్ధర్మ మస్త్రియాం పుణ్యశ్రేయసీసుకృత” మని అ. సుమిత్ర = లెస్సచెలికాఁడైన, అనఁగాఁ బుణ్యముతోఁ గూడినవాఁ డనుట, అనవరత = ఎడతెగని, నయ = నీతిగల, యోగ = ఆత్మయోగముచేత, ఆఢ్యున్ =సంపన్నుఁ డైనవాని, రామున్ = మనోహరుని, ఆత్మేశున్ = తనపతిని, తోడ్కొంచు, స్వస్థానమునకున్ = స్వర్గస్థానమునకు, చనియెను.
| తే. | అట్లు తండ్రిచేత విసృష్టులైనయట్టి | 14 |
భారత. అట్లు, తండ్రిచేతన్ = పాండురాజుచేత, విసృష్టులైనయట్టి = విడువఁబడినట్టి, తండ్రి చచ్చినవా రనుట, రాకుమారులు = ధర్మజభీమార్జుననకులసహదేవులు, సహజననీకయాత్రన్ = తల్లియైన కుంతితోఁ గూడిన యాత్రను పూని, సంయమీశ్వరులచేత, నీయమానులగుచున్ = తోడుకొనిరాఁబడినవారై, విషాద మొదవన్ = ఖేదపడుచును, నిజపురమునకున్ = హస్తినగరమునకు, చనిరి.
రామ. తండ్రిచేత, విసృష్టులైనయట్టి = అంపఁబడినట్టి, రాకుమారులు = రామలక్ష్మణులు, సహజన్ = కులాచారయోగ్యమైన - స్వభావసిద్ధమైన దనుట, అనీకయాత్రను = యుద్ధయాత్రను, "అస్త్రియాం సమరానీకరణాః" అని అ. సంయమీశ్వర = విశ్వామిత్రునిచేత, నిజపురమునకున్ = ఆయోధ్యకు, విషాద మొదవన్ = ఖేద మగునట్లుగా, చనిరి.
| సీ. | అత్తెరంగునఁ జను నప్పుడు దమవార్త | |
| ఆ. | మగుచుఁ బరగె నమ్మహాబలముదము భ | 15 |