Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారత. ఆయమ = మాద్రి, మహాయతధైర్యమహి = అధికధైర్యస్థాన మైనది, మగని = పాండురాజుయొక్క, అసురక్ష = ప్రాణరక్షను, అమత్యాయత్తతన్ = అబుద్ధివశమున, తాఁ జేయక, ఆయతనుక్రియకున్ = ఆమన్మథక్రీడకు, అతనినియతిచేన్ = ఆపాండురాజు దురదృష్టముచేత, చేరెను.

రామ. ఆయమనియమైకనిధి = యమనియమములకు ముఖ్యస్థానమైన యావిశ్వామిత్రుఁడు, “శరీరసాధనాపేక్షం నిత్యం యత్కర్మ తద్యమః, నియమస్తు స యత్కర్మ నిత్యమాగంతుసాధన” మ్మని అ. మహాయతధైర్య, మహిమ = మహిమను, కని = ఎంచి, మఱియొక యర్థము. మహిమకు, గని = ఆకరమైనవాఁడు, అసురక్షయము = రాక్షసనాశమును, అత్యాయత్తత = ఆసక్తిచేత, అతనుక్రియకు=అధికోద్యోగమునకు, అతనినియతిచే = ఆదశరథునిభాగ్యమున, చేరెను = వచ్చెను.

చ.

మనుజవరుండు నప్డు నడుమన్ ఘటియిల్లెడు విఘ్నవాక్ప్రవ
ర్తనలు గురుప్రయత్నవిహతంబులు సేయుచు రామ యేక్రియన్
నిను విడ నేర్తు నంచుఁ గడు నెమ్మిఁ గవుంగిటఁ జేర్చి యంతటం
దనయసువాంఛ ఉంచి తగఁ దన్పెఁ దదర్థిఁ గృతార్థుఁ గామునిన్.

11

రామ. మనుజవరుండు = దశరథుఁడు, విఘ్నవాక్ప్రవర్తనలు = అంపలేననుమాటలను, గురుప్రయత్న = వసిష్ఠునినిర్బంధముచేత, విహతంబులు సేయుచున్ = మాన్చినవాఁడై, తనయసువాంఛన్ = అధికపుత్రవాత్సల్యమును, డించి, తత్ = ఆరాముని, ఆర్థిన్ = తోడుకపో నిశ్చయించినవాని, మునిని గృతార్థుగాఁ దన్పెను.

భారత. మనుజవరుండు = పాండురాజు, నడుమన్ ఘటియిల్లెడు, విఘ్నవాక్ప్రవర్తనలు = మాద్రిప్రతికూలోక్తులను, గురుప్రయత్నవిహతంబులు సేయుచున్ = అధికప్రయత్నముచేత మాన్పుచు, రామ = మాద్రికి సంబుద్ధి. తనయొక్క, అసువాంఛను డించి, తత్ = ఆప్రాణములను, అర్థిన్ = హరియింప నిశ్చయించినవాని, కృత = చేయఁబడిన, అర్థున్ = ప్రయోజనము గలవాని, సంఘటనకర్త యనుట, తన్ఫెను, మాద్రిమాటలు వినక సంభోగించె ననుట.

తే.

స్వవిధివిఘ్ననిరాసంబు సలుప నతఁడు
రామసాంగత్య మర్థించెఁ బ్రమదగరిమఁ
బెనుచు తదనుయాత్రకు నంతఁ దనువు వొంగఁ
బ్రస్ఫుటం బైనయుత్సాహభరముఁ బూనె.

12

భారత. స్వవిధి = తనవిధి, విఘ్ననిరాసంబు సలుపన్ = విఘ్నము లేకుండఁ జేయఁగా, స్త్రీయొక్క, సాంగత్యమును, అర్థించెను = క్రీడించె ననుట, అంతన్ = అటుతర్వాత,