Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విగణింపరానిదుర్వృత్తి నధర్మపు
            దశల పనులయాస్పదంబు గాఁగఁ


తే.

జలుపఁ గలవీతనియతుల సాహసాతి
శయసమున్నతులనికృతశ్లాఘు లగుచు
నార్యు లబ్బాలురసితభావ్యర్థదృష్టి
నరసి మదిలోన నుఝ్ఝితవ్యసను లైరి.

72

రామ. దుర్యోధనుండు = యుద్ధము చేయశక్యము గానివాఁడు, దుశ్శాసనుండు = దుష్ట మైనయాజ్ఞ గలవాఁడు, దుర్ధర్షణుండు = ఎదిరింపరానివాఁడు, దుర్ముఖుఁ డనన్ = బహుప్రలాపి యనఁగాను, అమరు, వీరాదిగానారూఢగాఢశౌర్యప్రదీప్తున్ = వీరులలోపల, ఆదిగాన = ప్రథమగణ్యత్వమును, ఆరూఢ = పొందినట్టి, గాఢశౌర్యముచేత, ప్రదీప్తున్ = ప్రకాశించెడువాని, లఘూకరణ = తృణీకరించుటచేత, విషణ్ణ = దీనులయిన, విబుధ = దేవతలచేత, నింద్యమానమైన, ఉదయున్ = అభ్యుదయము గలవాని, లసద్విచార వివర్జితాచారున్ = దురాచారుని, మతుల, విగణింపరానిదుర్వృత్తిన్ = తలఁచరానికష్టపుజీవుని, “వృత్తిర్వర్తనజీవనే” అని అ. అధర్మపున్ = పాపరక్షకుని, ఇటువంటి, దశలపనున్ = దశముఖుని, లయ = నాశనమునకు, ఆస్పదంబు గాఁగ = స్థానమైనవానిఁగా, ఈతని = ఈరామునియొక్క, అతులసాహసాతిశయసమున్నతులు, చలుపఁగలవు, అని = ఇటని, కృతశ్లాఘు లగుచు నార్యులు, అబ్బాలు = ఆరాముని, రసిత = రుచిగొనఁబడిన, భావ్యర్థ = భవిష్యదర్థముయొక్క, దృష్టి =జ్ఞానముచేత, “దృష్టిర్జ్ఞానేక్షి దర్శనే” అని అ. అరసి మదిలోన నుఝ్ఝితవ్యసను లైరి.

భారత. దుర్యోధనుం డన, దుశ్శాసనుం డన, దుర్ధర్షణుఁ డన, దుర్ముఖుం డన, వీర లాదిగా ఆరూఢగాఢశౌర్యప్రదీప్తులను, ఘూక = గుడ్లగూబలయొక్క, రణధ్వనిచేత, “యుద్ధే రవే రణః” అని అ. విషణ్ణ = ఖిన్నులయిన, నానా, విబుధ = విద్వాంసులచేత, నింద్యమానోదయుల = దూషింపఁబడుచున్న పుట్టువు గలవారిని, సద్విచార = వివేకముతోడ, విసర్జిత = మిక్కిలి యెడఁబాసిన, ఆచారు = మంచిది గాని, మతులన్ = మతి గలవారిని, విగణింపరాని దుర్వృత్తిచేత, అధర్మపుదశల = పాపములైన చర్యలయొక్క, 'అధర్మపు’ అనుపునాదేశమునకు లక్షణము. క. 'ధీనిధి గుణపదములపై, మాను గహ ల్లున్న నంతిమములగుములకుం, బూని పునాదేశ మగున్, భూనుత పైనచ్చు లున్నఁ బుట్టగుములకున్. క. వాదపుఁబంతంబులును బ్ర, మోదపుశృంగారములును ముత్తెపుసరులున్, జూదపురిట్టలు నెయ్యపు, టాదరములు గనఁగ నివి యుదాహరణంబు' లని యాంధ్రభాషాభూషణము. పనుల = ప్రయోజనములకు, ఆస్పదంబుగాఁ