Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిజాగ్రసతికిన్ = కుంతికి నని క్రిందటి కన్వయము. దౌహృదోదయమునకు, నిమిత్తంబులైన = చిహ్నములైన, “నిమిత్తం వ్యంజనం పద” మని అ. ఆసగములన్ = ఆశాపరంపరలను, లోస నరయన్ = లోలోపలనే తెలియునట్టుగా, రయ= వేగముచేత, వ్యగ్ర = సంభ్రమపడుచున్న, బుద్ధిచేత, కోర్కులెల్ల నొనఁగను, తత్పరిగ్రహజనుల = ఆకుంతిపరిచారికలను, పనిచెను. వారును = ఆపరిచారికలును, అట్లు సలిపిరి.

క.

భరియించె నపుడు విబుధో
త్కరసంప్రార్థన మొనర్చుకడఁక దలిర్పన్
హరిమధ్యమభువనముఁ బ్రో
చురతిం దద్ధర్భభావశోభనలీలన్.

64

భారత. అపుడు, హరిమధ్యమ = సింహమధ్య, కుంతి, తద్గర్భ = ఆగర్భస్థునియొక్క, భావ = అభిప్రాయముయొక్క, శోభనలీలచేత, విబుధోత్కర = విద్వత్సమూహముయొక్క, సంప్రార్థనమును, ఒనర్చు, కడఁక = యత్నము, తలిర్పన్, భువనముఁ బ్రోచు రతిని భరియించెను.

రామ. విబుధోత్కర = దేవసంఘముయొక్క, హరి = విష్ణువు, మధ్యమభువనమున్ = భూలోకమును, ప్రోచు, రతి = ఆసక్తిచేత, తత్ = ఆకౌసల్యాకైకేయీసుమిత్రలయొక్క, గర్భభావ = గర్భత్వ మనెడి, “గర్భోబ్రూణఇమౌ” అని అ. శోభనలీలను భరియించెను.

ఉ.

దీనులఁ బ్రోవఁ గోరుదు రతిక్రమసత్కరుణన్ విపక్షసం
తానము ద్రుంపఁ గోరుదురుదాహరణీయరణైకశిక్ష నం
భోనిధిమధ్యభూభరముఁ బూనఁగఁ గోరుదురత్యయోన్నతి
న్మానవనాథకాంత లసమానగుణాద్భుతగర్భసంగతిన్.

65

రామ. మానవనాథకాంతలు, అసమాన = అసాధారణములైన, గుణములచేత నద్భుతమైన గర్భముయొక్క, సంగతిన్ = సాంగత్యముచేత, అతిక్రమ = అతిశయముచేత, సత్ = లెస్సైన, కరుణ = దయచేత, దీనులఁ బ్రోవఁ గోరుదురు, ఉదాహరణీయ = వర్ణింపఁదగిన, అత్యయ = అధికభాగ్యముయొక్క, “అయశ్శుభావహో విధిః” అని అ. కడమ సులభము.

భారత. మానవనాథకాంత, లసమానగుణ = సద్గుణములచేత, “లషకాంతౌ” అనుధాతువుమీఁద శానచ్ రాదు, “లష్ కాంతౌ”మీఁద వచ్చును గనుక, అందు, “సహరితాలసమాననవాంశుకః” అని మాఘకావ్యమందుఁ బ్రయోగము. దురతిక్రమ = నివా