Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ననఘమతు లైనమునులతో నాత్మయోగ
మొకటి కొద లేకయుండఁ జేయుచును వేడ్క.

59

రామ. ప్రతిపదంబును = అన్నిప్రయోజనములయందును, "పదం వ్యవసితత్రాణస్థానలక్ష్మాంఘ్రివస్తుషు” అని అ. నిజపురోహిత = వసిష్ఠునకు, మత = సమ్మతమైన, అనుశీలమునన్ = అనువర్తనమున, సదీక్షావిశేషుఁడు = దీక్షావిశేషముతో గూడినవాఁడు, అగుచు నాత్మయాగముఁ జేయుచు, ధరణిపుఁ డుండె నని ముందరిపద్యమున కన్వయము.

భారత. ప్రతిపదంబును = పల్మాఱును, నిజ = స్వకీయమైన, పురః = ఆముష్మికముకొఱకు, హితమైన, మత = యోగముయొక్క, పురా= ఆదియందె, ఊహితమైన, మత = యోగమందలి సంకల్పముయొక్క యనియుఁ జెప్పవచ్చును. అనుశీలనమునన్ = పరిచయముచేత, సత్ = లెస్సైన, ఈక్షావిశేషుఁ డగుచున్ = జ్ఞానము గలవాఁడై, మునులతోఁ గూడ, ఆత్మయోగము = బ్రహ్మోపాస్తిని, “ఆత్మాదేహమనో బ్రహ్మస్వభావధృతి బుద్ధిషు” అని వి. చేయుచును.

చ.

ధరణిపుఁ డుండె నంత బహుధామునిసన్మనుహూయమానుఁ డై
పరమసమృద్ధిఁ బర్వెడువిభావసునందనురూపకాంతిని
ర్భరు గొద లెల్ల దూరముగఁ బాయసభాజనగౌరవానమ
త్కరు ఘను నొక్కనిం బ్రమదగౌరవ మొప్పఁగఁ గాంచి సన్నిధిన్.

60

భారత. ధరణిపుఁడు = పాండురాజు, ఉండెన్ = ఈపూర్వోక్తప్రకారమున వర్తించుచుండెను, అంత, బహుధామునిన్ = అధికతేజస్సు గలవాని, “గృహదేహత్విట్ప్రభావాధామాని” అని అ. సన్మను = ఘనమైన మంత్రముచేత, హూయమానుఁడై = పిలువఁబడ్డవాఁడై, పర్వెడు, విభావసునందనున్ = సూర్యపుత్త్రుఁడైన యముని, రూపకాంతినిర్భరు = సౌందర్యతేజములచేత నధికుఁడైనవాని, కొదలు = కొదవలు, పాయన్ = పోవునట్టుగా, సభోజనగౌరవ = సన్మానాతిశయముచేత, “ఆనందన సభాజనే” అని అ. అనమత్ = వ్యాహర్తి యగుచున్న, కరున్ = హస్తము గలవాని, ఫలితార్థము ప్రేమాతిశయముచేత హస్తాభినయపూర్వకముగాఁ జేరఁబిలుచుచున్నవాని ననుట, ఒక్కనిన్ = ఒంటిగా వచ్చినవాని, ఇవి యమునికి విశేషణములు. సన్నిధిన్ = సమీపమున, “సన్నిధిస్సన్నిానేన భవే దింద్రియగోచరే” యని వి. ప్రమద గౌరవము = సంతోషాధిక్యము, ఒప్పగా, కాంచి = చూచి, అప్పు డాయార్య యుండెనని ముందరిపద్యమున కన్వయము.

రామ. ధరణిపుఁ డుండెను, బహుధా = బహుప్రకారములైన, మునులయొక్క, సన్మను = శ్రేష్ఠమంత్రములచేత, హూయమానుఁడై = వేల్వఁబడుచున్నవాఁడై, పరమ