రామ. అవితథసంకల్ప = సంబుద్ధి. ధరాదివిజులలోన్ = బ్రాహ్మణులలోను, ఎట్టివారిఁ దెచ్చి, వరింతున్ = యాగార్థము నియమింతును. వివరింపవలయు, మీరుచెప్పినయతనిన్ = ఋశ్యశృంగుని, పుత్త్రేష్టివిధికి, రప్పింతున్ = రప్పించెదను.
| చ. | అనయముఁ దత్వబోధమున నంచితధర్మనిరూఢియందు స | 56 |
రామ. అనయమున్ = ఎల్లప్పుడును, అమ్మహాతున్ = ఋశ్యశృంగుని, విబుధావళిలోపలన్ = విద్వత్సమూహములోపల, పెద్ద యండ్రు, మంత్రవిధులయందు దక్షమతి యైనవాని, రుచిర = మనోహరమునై, వర్ణ్య = వరింపఁదగిన, నిసర్గ = స్వభావముచేతనైన, “స్వరూపంచ స్వభావశ్చ నిసర్గశ్చ" అని అ. మనఃప్రసాదుఁడై = మనఃప్రసన్నత గలవాఁడై, “ప్రసాదస్తు ప్రసన్న తా" అని అ. తనరెడువాని = ఋశ్యశృంగుని, భజియించి = మనసురాఁ గొలిచి, శాంతతోన్ = శాంతాదేవితోఁ గూడ, తేఁదగున్ = తోడ్తేవచ్చును.
భారత. అనన్ = కుంతి యి టనఁగా, పాండురా జనుమాట, విబుధావళిలోపలన్ = దేవసంఘములోను, 'విబుధః పండితే దేవే' అని వి. యమున్ = యముని, మంత్రవిధి = మంత్రానుష్ఠానమందు, దక్ష =సమర్థమైన, మతిన్ = బుద్ధిచేత, భజియించి తేఁదగును.
| క. | అని నృపుడు భార్యతో నా | 57 |
భారత. అని = ఇటని, నృపుఁడు, ఆయనన్ = యముని, తడయక తెచ్చి, ఆగమాచారముతోన్ = దేవరన్యాయశాస్త్రవిధితోడ, తనకుఁ దనూభవలాభం బొనరం జేయుటకు, భార్యతోన్ = కుంతితోడ, కడుఁ బ్రియోక్తులు పలికెను.
రామ. నృపుఁడు = దశరథుఁడు, భార్యతో = శాంతతోఁగూడ, ఆయనన్ = ఋశ్యశృంగుని, తడయక = శీఘ్రమె, తెచ్చి, తనకుఁ దనూభవలాభంబు, ఒనరన్ = కలుగునట్టుగా, ఆచారముతో యాగముఁ జేయుటకుఁ బ్రియోక్తులు పలికెను.
| వ. | ఇట్లు నియమించి. | 58 |
| తే. | ప్రతిపదంబును నిజపురోహితమతాను | |