Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బడినదై, సుపుత్త్రసంసిద్ధిని జేయుఁ గావున, తత్ = ఆయజ్ఞముయొక్క, కర్మకలనకున్ = ప్రయోగవిధికి, వరియింపవలయు నాతనిన్ = వరియింపవలసిన ఋశ్యశృంగుని, తెచ్చు, వైపు = ఉపాయమును, చూడుము, అనుడు = వసిష్ఠు డి ట్లన్నంత, దశరథుఁ డనుమాట, సుమంత్ర = సుమంత్రుఁ డనుమంత్రియొక్క, “ధృష్టిర్జయంతో విజయ స్సిద్ధార్థో హ్యర్థసాధకః, ఆశోకో మంత్రపాలశ్చ సుమంత్ర శ్చాష్టమంత్రిణః" అని రామాయణమందు. ఉపదేశము = చెప్పినవాక్యము, దీనికిన్ = మీవాక్యమునకు, ఒనరియున్నది. "ఋశ్యశృంగం ద్విజశ్రేష్ఠం వరయిష్యతి ధర్మవిత్, యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థంచ నరేశ్వరః” ఇటను సనత్కుమారవాక్యమును సుమంత్రునివల్ల దశరథుఁడు విన్నాఁడని రామాయణమునందుఁ జెప్పియున్నది గనుక, దానన్ = మీతలఁపున, ఇచటికి వేల్పులనేని, ఆజ్ఞ = నీయాజ్ఞయొక్క, అతిశయమునఁ దెత్తును, ఓయనఘ - నాతండ్రి-సంబుద్ధులు. నిను, మాధవుబలెన్ = విష్ణువువలె, భజించి, నీమంత్రశక్తిచేత, ఈగరిమ = ఈపూజ్యత్వమును, మెఱయఁ గంటిని.

భారత. అదియున్ = నేఁ జెప్పినప్రకారమును, అలఘుపావనగుణములచేత,ఉజ్జ్వల = ప్రకాశించుదానా, సంబుద్ధి, దృశ్య = కంటి కింపైన, శృంగారముచేత, చితమై = చేయఁబడ్డదై, సుపుత్త్రులయొక్క సంసిద్ధిని జేయుఁగావున, తత్కర్మకలనకు = ఆదేవరన్యాయవిధికి, వరియింపవలయునాతనిన్ = వరియింపవలసినవాని, తెచ్చువైపుఁ జూడుము అనుడున్ = పాండురా జిట్టు లనఁగా, కుంతి యనుమాట. పూర్వమున నేను, కనిన = తెలిసిన, సుమంత్రోపదేశము = మంచిమంత్ర ముపదేశ మౌట. ఇపుడు, దీనికిన్ = మీవాక్యమునకు, ఒనరియున్నది. పుత్త్రేష్టికి, వేల్పులన్ = దేవతలను, దానన్ = ఆమంత్రమున, ఇచటికిఁ దెత్తును. ఓయనఘ = సంబుద్ధి. నాతండ్రి = కుంతిభోజునియొక్క, ఆజ్ఞ యతిశయమున, సాక్షాదీశ్వరాంశ మవు = సాక్షాద్రుద్రాంశమైన, తపస్వివరునిన్ = దుర్వాసుని, ఉమాధవుబలె భజించి యీమంత్రశక్తిని గంటిని. ఈగరిమ = ఇట్లు దేవతలఁ దెచ్చెడుమహిమ మెఱయన్ = వెలయఁగా, కంటినని క్రిందటి కన్వయము.

వ.

కావున.

54


క.

అవితథసంకల్పధరా, దివిజులలో నెట్టివారిఁ దెచ్చి వరింతున్
వివరింపవలయుఁ బుత్త్రే, ష్టివిధికి రప్పింతు మీరు చెప్పినయతనిన్.

55

భారత. అవితథసంకల్పధరా = సఫలమైన మనోరథమును వహించినవాఁడా, సంబుద్ధి, దివిజులలోన్ = దేవతలలోపల, పుత్త్రేష్టివిధికిన్ = పుత్త్రేచ్ఛాసిద్ధికి, మీరుచెప్పిన యతని రప్పింతును.