Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పెనయ సుతేష్టిఁ జేసి నిను నే నియమించుచు నున్నవాఁడ నె
మ్మనమునఁ జింత దక్కి సుసమాహితవృత్తి నొనర్పు మవ్విధిన్.

50

రామ. అనన్ = దశరథుఁ డిట్టనఁగా, ఆతఁడు =వసిష్ఠుఁడు, ఇట్లనును, సుతేష్టిఁ జేసి = పుత్త్రకామేష్టి నాచరించి.

భారత. అనన్ = కుంతి యి ట్లనఁగా, అతఁడు = పాండురాజు, ఇ ట్లనును. సుతేష్టిఁ జేసి = పుత్త్రవాంఛచేత, “ఇష్టిర్యాగేచ్ఛయోః” అని అ. కడమ సులభము.

క.

అవినింద్యమతి వసుమతీ
ధవగుర్వాదేశమునను దా నెద్ధానిన్
సవరించిన నది యిష్టము
నవిలంబత నొసఁగు సందియము వల దెందున్.

51

భారత. అతివ-సుమతీ-సంబుద్ధులు. ధవ = భర్తయొక్క, గుర్వాదేశమునన్ = ఘనమైన యాజ్ఞచేత, తా నెద్ధాని సవరించినను నది, అవినింద్యము = దూష్యము గానిది, ఇష్టమున్ = అభీష్టమును, ఒసఁగును.

రామ. అవినింద్యమతి-వసుమతీధవ-సంబుద్ధులు. గురువుయొక్క యాదేశమున, కడమ యేకార్థము.

వ.

అదియు.

52


సీ.

అలఘుపావనగుణోజ్జ్వలదృశ్యశృంగార
            చిత మై సుపుత్త్రసంసిద్ధిఁ జేయుఁ
గావునఁ దత్కర్మకలనకు వరియింప
            వలయునాతనిఁ దెచ్చువైపుఁ జూడు
మనుడుఁ బూర్వమున నేఁ గనినసుమంత్రోప
            దేశ మొక్కటి యిప్డు దీని కొనరి
యున్నది మీతలం పొకటి పొల్లగునె పు
            త్త్రేష్టికి వేల్పుల నే నిచటికి


తే.

దానఁ దెత్తు నోయనఘ నాతండ్రియాజ్ఞ
యతిశయమున సాక్షాదీశ్వరాంశమవు త
పస్వివరునినుమాధవుబలె భజించి
కంటి నీమంత్రశక్తి నీగరిమ మెఱయ.

53

రామ. అదియున్ = ఆయజ్ఞమును, అలఘు = అధికములైన, పావనము లైనగుణములచేత, ఉజ్జ్వలత్ = ప్రకాశించుచున్న, ఋశ్యశృంగమునిచేత, ఆరచితమై = చేయఁ