Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ. అనవగత = తెలియఁబడని, ఊనత = అల్పత్వము గలది, భవత్ = నీయొక్క, కృపావిభూతిఁ గనినయేను, తనయాపేక్షా = పుత్త్రులయందలి యపేక్షచేత నైన, దీనతన్ = దైన్యమును, ఇతరునట్లు = వింతవానిలాగున, పొందుట ర్హమె, కాకుస్వరము.

భారత. అనన్ = ఇట్టనఁగా, వగతోన్ = వగపుతోఁగూడ, నతయై = నమ్ర యైనదై, కుంతియనుమాట, ఏను, తనయాపేక్షాదీనతచేత, ఇతరున్ = పరుని, అట్టు = నీవు చెప్పినప్రకారము, పొందు టర్హమె.

మ.

ఎనయన్ లోకగురుప్రశస్తి గలనీయిల్లాలనై కాంతవ
ర్తనలం బర్వుచు నుర్వి మానవతులన్ ధన్యస్థితిన్ మించి యొ
ప్పినన న్నర్హమె యి ట్లనందనులయాభీలార్తిపాల్సేఁత పా
వన మౌనీశ్వర యింతకంటె నయశోవాదంబు లే దెన్నఁగన్.

49

భారత. లోకములయందు, గురుప్రశస్తి గల = అతిప్రసిద్ధి గలిగిన, నీయొక్క యిల్లాలనై, కాంత = మనోహరములైన, 'కాంతం మనోహరం రుచ్య' మని అ. వర్తనలచేత, ఉర్విన్ = భూమియందుఁగల, మానవతులన్ = స్త్రీలను, మించి యొప్పిన నను నిట్టన, అర్హమె = న్యాయమా, ఈశ్వర-సంబుద్ధి, ఇంతకంటెన్ = పరపురుషసంగతికంటె, తనులయ = శరీరనాశనముచేతనైన, అభీలార్తి = కష్టమైనపీడకు, “స్యాత్కష్టం కృచ్ఛ్ర మాభీల" మని అ. పాల్సేఁత = అధీనముఁ జేయుట. పావన మౌను, అటైనను, అయశోవాదంబు లేదు. "అపయశోయద్యస్తి కిం మృత్యునా" అనున్యాయమున జన్మహాని రాకుండును.

రామ. లోకగురు వనెడు ప్రశస్తి గలనీయొక్క, ఇల్లాలనై కాంతవర్తనలన్ = ఈలాలనయొక్క యత్యంతవర్తనలచేత, “తీవ్రై కాంతనితాంతాని” అని అ. మానవతులన్ = మనుష్యసామ్యమును, మించి, ఇట్లు, అనందనుల = అపుత్త్రకులయొక్క, ఆభీలార్తిపాల్సేఁత యర్హమె, కాకుస్వరము, పావనమౌనీశ్వర సంబుద్ధులు, కడమ సమము.

ఈలాలన యనుదిక్కున నిల్లాలన యని వచ్చినందునకు, క. 'ముదమున నా ఈ ఊలను, పదములతుద లూష్మ లుడుగఁ బైవర్ణముతో, నదుకునెడం గవియును దుది, గుదియఁగ మఱి జడ్డవ్రాలగుం బైహల్లు' లని యాంధ్రభాషాభూషణమందు, మ. 'ఎనయన్ లోకగురుప్రశస్తి గలనీయిల్లాలనై యనుదిక్కున' క. 'తెలుఁగున యా గలుగదు దొలి, యిల యావలె నుండువర్ణ మేకార మగు' నను లక్షణమువల్ల నేత్వమేగనుక నికారమునకు యతి చెల్లెను.

చ.

అన నతఁ డిట్లనుం గలఁక నందఁగ నేఁటికిఁ దొల్లి యీక్రమం
బున ననపత్యు లౌనృపులు పుత్రులఁ గానరె యెందఱేనిఁ బెం