నశేషయే' త్తను నియతివలన, అర్థాంతరము. శత = నిగ్రహమునకు రాని, అంతరంగ = హృదయమువల్ల నైన, రిపులను = వ్యసనరూపములయిన శత్రువుల ననుట. 'స్త్రీద్యూతమృగయాపానవాక్పారుష్యార్థదూషణం, వాగ్దండనం చ సప్తైతే వ్యసనాని విదుర్బుధాః' అని గ్రంథాంతరము. 'మృగయాక్షౌదివాస్వాపః పరీవాదః స్త్రియానుగః, తౌర్యత్రికం వృథాట్యాచ కామజా దశధాగుణాః' అని కామందకము. నెఱయం బొలియింపుచున్ = పెంచకుండఁ జెఱుచుచును, 'ఆత్మానమేవ ప్రథమం వినయేనోపపాదయేత్, తతోమాత్యాం స్తతోభృత్యాం స్తతఃపుత్రాం స్తతఃప్రజాః' అని నీతిసారము, ‘వినేయోహీంద్రియజయస్తద్యుక్తశ్శాస్తు మర్హతి' అని రామాయణము. సమాధిక = సములతోడను నధికులతోడను రహితుఁడైన, ప్రభుమంత్రోత్సాహశక్తులచేత నందఱినీ లోఁబడనడఁచి సర్వాధికుఁడైన యనుట. ఆత్మ = తనయొక్క, వర్తనన్ = రాజధర్మముచేత, 'న్యాయేనార్జనమర్థస్య రక్షాసంవర్ధనం తథా, సత్పాత్రప్రతిపత్తిశ్చ రాజవృత్తం చతుర్విధ' మ్మని కామందకము. అతిస్థిరుఁడై = ఊర్జితుఁడై, అర్థాంతరము. సమాధికరహిత = సాధారణమైన, ఆత్మ = శరీరముయొక్క, వర్తనన్ = స్థితిచేత, అతిస్థిరుఁడై = స్థైర్యగుణముగలవాఁడై, 'షణ్ణవక్యంగుళోత్సేధో యః పుమాన్ స దివౌక సః, ఉరశ్చ మణిబంధశ్చ ముష్టిశ్చ నృపతేః స్థిరః' అనియు లక్షణశాస్త్రము. ప్రణిధి = గూఢచారులయొక్క, 'ప్రణిధిః ప్రార్థనే చారే' అని అ. యుక్తిన్ = అంపుటచేత, ప్రధానపురుష = పురోహితమంత్రిపుత్రజ్ఞాతిదండనాయకులయొక్క, 'పురోహితామాత్యకుమారకుల్యసేనాప్రణేతారఇతి ప్రధానాః' అని కామందకము. అంతరవర్తనన్ = అంతరంగవృత్తాంతమును, ఆకలింపుచున్ = తెలిసికొంచును, 'చరాన్ ప్రచారయే దర్థేష్వాత్మనశ్చ పరస్య చ, పాషండాదీనవిజ్ఞాతా నన్యోన్య మితరై రపి' అని నీతిసారము. అర్థాంతరము. ప్రణిధి = గూఢచారులయొక్క, ప్రయుక్తిన్ = వాక్యమును, పాయక = అతిక్రమింపక, ఎపుడును, ప్రధానపురుష = పెద్దమంత్రితోడ నగు. 'ప్రధానం స్యా న్మహామాత్యే ప్రకృతౌ పరమాత్మని' అని వి. అంతరవర్తనన్ = ఆప్తాలోచనను, ఆకలించుచున్ = చేయుచును. 'సదానుకూలేషు హి కుర్వతే రతిం నృషేష్వమాత్యేషు చ సర్వసంపదః' అని భారవి. అకలుష = దోషము లేని, యౌవనస్థ = ప్రాయపువానియొక్క, దశ = అవస్థను, విహారముల ననుట. ధర్మార్థకామములను బ్రాతర్మధ్యాహ్నసాయంకాలములయందు నాచరించుట ధర్మమే కనుక నకలుషపదము ప్రయోగించినాఁడు. 'ధర్మార్థకామాః కాలేషు త్రిషు యేన స్వనుష్ఠితాః' అని బ్రహ్మాండపురాణము. అర్థాంతరము. యౌవనస్థ = జవ్వనమందుఁ గలిగియున్న, దశ = అవస్థను, బహువిధరతిప్రసంగము ననుట. 'దశావస్థాననేకథా' అని అ. అంతయున్ = లెస్సగా, నడపెను. 'జాతిస్వభావగుణదేశజధర్మచేష్టాభావేంగితేషు వికలో రతితంత్ర
పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/66
స్వరూపం