కూడుకొనియె, వనిని, ఆఘనుఁడు = పాండురాజు, మునిచర్యలను బెంపు మీఱఁగా నడపెను. 4.
ఆనాల్గుపద్యములకు రాఘవార్థము. తనకుఁ గల, అగ్రజాయత్తముగన్ = బ్రాహ్మణాధీనముగా 'ద్విజాత్యగ్ర జన్మ భూదేవ బాడబాః' అని అ. అంచిత = అర్హములైన, నయబలముల చేత, లసత్ = ఒప్పుచున్న, వర్తనలు, అనివారితమైన, ఉదయ = అభ్యుదయముయొక్క, ఆశ్రయతన్ = ఆశ్రయత్వముచేత, అవనీస్థలిని మెఱయఁగానును. 1. మంత్రులవాక్యము. మనవి = విన్నపము, యుక్తితెఱంగు = యుక్తిమార్గము, మనవి చెప్పికొనునే ర్పనియుఁ జెప్పవచ్చును. మీకనినది, అరి = శత్రుఁడైన దశరథునియొక్క, నగరమునకున్ = పట్టణమునకు, అరుగుఁడని, పెదముదుసళ్ళును ననుఁగులును, ఆడన్ = చెప్పఁగా, వెరవు = వారు చెప్పినబుద్ధిని, కని, అరులు = శత్రువులు, కరముతోన్ = కప్పముతోఁ గూడ, 'భాగధేయః కరోబలిః' అని అ. కొలువఁగానును. 2. మానవతులా = ఇతరపురుషసామ్యముతోడ, రహితమైన, సత్త్వ = బలముయొక్క, అనుగతిన్ = యోగముచేత, అతినైపుణ్య = అధికనిపుణత్వముయొక్క, శ్రీ = సమృద్ధి, నెరయదయను జనావళి మెచ్చఁగా, ఆత్మ = తనయొక్క సామ్రాజ్యానుభవమును, పూనెన్ = వహించెను. 3. అనిభృత = గూఢముగాని, దాక్షిణ్యుండై = దక్షిణనాయకత్వము గలవాఁడై, క. 'పెక్కండ్రసతులయందును, జక్కనిమొగమోట మొక్కచందముగాఁ బెం, పెక్కిన దక్షిణనాయకుఁ, డక్కజముగఁ దెలియవలయు నార్యులు ప్రీతిన్' అని కావ్యాలంకారచూడామణి. తనయ = కుమారులయొక్క, ఆలోకనవిదూరతకుఁ గుందు, నిజాంగనలన్ = కౌసల్యాకైకేయీసుమిత్రలను, కూడి, అవనిన్ = భూమియందు, ఆఘనుఁడు = ఆలాగునఁ బ్రసిద్ధుఁడైన దశరథుఁడు, కామునిచర్యల్ = మన్మథక్రీడలను, పెంపు మీఱ నడపెను. 4.
| చ. | అకలుషయౌవనస్థదశయంతయుఁ దా నడపెన్ నృలోకపా | 41 |
రామ. నృలోకపాలకుఁడు = దశరథుఁడు, శఠ = కఠోరములైన, 'నికృతస్త్వనృజుశ్శఠః' అని అ, క్రోధగుణగ్రస్తములైనవి యనుట. అంతరంగములఁ గలశత్రువులను, క్రోధగుణములకు మనుస్మృతియందు, 'పైశున్యం సాహసం దోహ మీర్ష్యాసూయార్థదూషణం, వాగ్దండనంచ పారువ్యం క్రోధజోపి గుణోష్టధా' అని అ. నెఱయం బొలియింపుచున్ = లెస్సగా నిగ్రహించుచు, 'అగ్నేశ్శేషం ఋణాచ్ఛేషం శత్రోశ్శేషం