| తే. | తనకుఁ గలభూషణాదిసద్వస్తుజాల | 37 |
| తే. | మనవియుక్తితెఱంగు మీకనిన దడవి | 38 |
| క. | మానవతులారహితస, త్త్వానుగతిన్ శాంతిఁ దనరి యతినైపుణ్య | 39 |
| క. | అనిభృతదాక్షిణ్యుం డై | 40 |
ఆనాల్గుపద్యములకు భారతార్థము. భూషణాదిసద్వస్తుజాలమును, అగ్రజ = జ్యేష్ఠుఁడైన ధృతరాష్ట్రునకు, ఆయత్తముగ = అధీనమగునట్లుగా, "అధీనో నిఘ్న ఆయత్తః” అని అ. చేసి, అంచి = అంపి, సద్వర్తనలన్ = మంచినడకలు గలవారైన, తనయబలలన్ = కుంతీమాద్రులను, వనీస్థలియందుఁ జూడఁ జాలనని, వారితో, దయాశ్రయత = కృపాస్పదత్వము, మెఱయఁగా, అనుమాట. 1. మనవియుక్తి తెఱంగు, మీకనినది = మీరెఱింగినది, అడవినవయ నేటికి మన, కరినగరమునకున్ = హస్తినగరమునకు, అరుగుఁడు, ముదుసళ్లును = పెద్దలును, అనుఁగులు = ఆప్తులును, ఆడన్ = ఆపట్టణమందు, వెరవరులును గనికరముతో, కొలువన్ = కొలుచునట్టుగా, అనిపెదన్ = అంపెదను. అరుగుఁడని క్రిందటి కన్వయము. 2. మానవతులార = సంబోధనము. హితవైనసత్త్వగుణముయొక్క, అనుగతిన్ = ఆవృత్తిచేత, యతినై = తపస్వినై, పుణ్యములయొక్క, శ్రీ = సమృద్ధి, నెరయన్ = ప్రకాశించునట్టుగా - శ్రీశబ్దముమీఁద దెనుఁగునఁగూడ దీర్ఘ మున్నందుకు, క. 'స్త్రీలింగశబ్దవితతికి, నోలిం దుదిదీర్ఘ ముడుప నుండును దెనుఁగై, కోలదియేకాక్షరశ, బ్దాలి విసర్జించి నిర్జితాసురకృష్ణా' యని కవిలోకచింతామణి. ఆత్మబ్రహ్మమనెడి, సామ్రాజ్యముయొక్క, అనుభవమును బూనెదను, యజన = యజ్ఞములయొక్క, ఆవళిన్ = పఙ్క్తిని, మెచ్చను. 3. అని ఇట, భృతదాక్షిణ్యుండై, తనయొక్క, ఆలోకనవిదూరతకున్ = చూడకుండుటకు, కుందుచున్న నిజాంగనలను, కూడియ =