Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ. ఆధరణీపాలుఁడు = దశరథుఁడు, తమసాధునిన్ = తమసానదియందు, "తటినిహ్రాదినీ ధునీ” అని అ. యతికొమరు = మునిపుత్త్రునియొక్క, ఏఁడు = ఏండ్లు, ఆయు వనుట, జాత్యేకవచనము. క. 'రూకకు వేపోఁ కనఁగా, బ్రాకటముగ వృష్టి ప్రాణి భాగ్యం బనఁగా, లోకమున నాఁడు దానికి, శ్రీకర మగు సొమ్ము సువ్వె సిగ్గె యనంగ' నని కవిలోకచింతామణియందు, నేఁడు + అనుచోటను నర్ధబిందు వున్నందుకు, ఉ. 'వాఁడిమయూఖముల్ గలుగువాఁ డపరాంబుధిఁ గ్రుంకె ధేనువుల్, నేఁ డిట వచ్చె నేకతమనిష్ఠమెయిన్ భవదగ్నిహోత్రముల్, పోఁడిగ వేల్వఁగాఁ బడియెఁ బ్రొద్దును బోయెఁ గచుండు నింటికిన్, రాఁడు వనంబులోన మృగరాక్షసపన్నగబాధ నొందెనో' యని నన్నయభట్టప్రయోగము, సమసెనే యని, వారిపజ్జకున్ = ఉదకసమీపమునకు, చనియెను.

క.

చని తన్ముఖమునఁ దద్వ
ర్తనవిధ మంతయును విని ధరారమణుఁడు ద
త్తనుశరవేదనఁ గ్రమ్మఱి
తనుఁ బొదవినయ ట్లతివ్యధావిహ్వలుఁ డై.

24

రెంటికి సమము సులభము.

క.

ఏనుం గనికర మరయక
పూనితిఁ గా కిట్టియెడలఁ బొసఁగునె యేయం
గానమెకాలని యమగతి
తో నావేఁట మునియుగము ద్రుంగించెఁ దుదన్.

25

రామ. ఏనుంగని = గజమని, సీ. 'ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ రాఁ బురవీథులఁ గ్రాలఁ గలదె' అని సోమయాజి. కరము = మిక్కిలి, అరయక = విచారింపక, పూనితిఁగాక, ఇట్టియెడలన్ = ఈయాశ్రమభూములయందు, ఏయను, పొసఁగునె = యుక్తమౌనా, అని కాకుస్వరము. కానమే = ఎఱుంగమా - "నృపతే రవధ్యో నన్యః కరీ” అనునర్థము ననుట. కాలనియమగతితోన్ = కాలప్రేరణతోఁ గూడి, “లలాటలిఖితా రేఖా పరిమార్ష్టుం న శక్యతే” అని న్యాయము. మునియుగము = మునికుమారుని యాయుస్సును, నానుడువార్త, తుదన్ = వేఁట యగుసమయమున, త్రుంగించెను = క్రియ.

భారత. ఏనున్ = నావంటివాఁడును, కని = ప్రత్యక్షముఁగ జూచి, కరమరయక = చెయి గొంచింపక, ఇట్టియెడలన్ = ఈక్రీడాసమయములయందు, కనికర మరయక = దయ లేక యనియుఁ జెప్పవచ్చును. ఏనును + కనికరమను దిక్కున సంధికి, క. 'వాంతములైన పదంబుల, పొంతం బై నున్న శబ్దముల కచటతపల్, దొంతిగజడదబ లగున, య్యంత