తంబునకుఁ ద్రోవ, నంధ్రభాషయుఁ బ్రాకృతాహ్వయమె కాన, వలయుఁ దల్లక్షణంబులు వరుసఁ దెలియ. క. వదలక సిద్ధాక్షరములు, పొదివిన వర్ణములు దూలిపోఁబలుకఁగ న, ర్థదమై ప్రాకృతనిభమగు, నదిక తద్భవపదమునాఁగ నభిమత మయ్యె' నని చెప్పినలక్షణమువలన, కన్యకాశబ్దము ప్రాకృతమున, 'మనయామ్ = అధోవర్తమానానాం మకారనకారయకారాణాం లోపస్స్యా' త్తని కియ్యవడికి లోపము వచ్చి, 'శేషాదేశస్యార్హో చోఘోః=అవశిష్టస్యాచః పరస్యసంయుక్తాదేశస్యాహరస్యహలోద్విత్వం భవతి' అని నకారద్విత్వమును వచ్చి యంత్యకకారము లుప్తమై యుపర్యకారమునకు యకారశ్రవణము రాఁగా, కన్నయా అని యుండును. ప్రాకృతాపభ్రంశరూపమై తద్భవ మయ్యెనేనిఁ, దెనుఁగునఁ గన్నియ యనవలెను. కన్యాశబ్దమే తద్భవ మయ్యెనేనిఁ గన్నె యని యుండును గనుక బహువచనమందుఁ గన్నియలు కన్నె లనవలెఁ గాక భారతార్థమందుఁ గన్నెకల నని కన్యకాశబ్దముమీఁద నంత్యకకారము యకారము గాకయే మధ్యైత్వము వచ్చి తెనుఁగై యుండదు. ఎట్లు విచారించినను, రెండర్థములకు సరిపోదని సందేహింతురు, గ్రంథకర్త కన్నెలకలననయని యేత్వము నిలువఁజెప్పలేదు. అది లేఖకదోషము. తే. 'పుడమి స్త్రీలింగశబ్దంబు కడకకార, మునకు వచ్చుయకారంబు గనఁగఁ గొన్ని, యెడల నెత్వంబు నగుఁ గియ్యవడియు నగును, జడ్డ యగుచోట నైశాటచక్రశమన. తే. 'వధునికకుఁ జెల్లు వదినియ వదినె యనఁగ, వర్ణికకుఁ జెల్లు వన్నియ వన్నె వన్య, యనఁగ నీరీతి మౌక్తికంబునకుఁ జెల్లు, ముత్తియము దొడ్డముత్తెము ముత్య మనఁగ.' ముక్తయే మౌక్తికము. అని. కవిలోకచింతామణియందుఁ జెప్పినలక్షణమువలనఁ గన్యకాశబ్దముమీఁద దెనుఁగునఁ గన్యయనికియ్యవడియుండనేచెప్పినారు కాఁగా భారతార్థమందు గన్యకలనని చెప్పవచ్చును. తత్సమపదము, ప్రకృతము, వాలుఁదూపులన్ = తీక్ష్ణబాణములచేత, జయించి, అతను = విస్తారములయిన, జయశ్రీలను వరియించెను. కోసలకేకయమగధులయొక్క, తనయలన్ = కౌసల్యాకైకేయీసుమిత్రలను, వరించి నయాజ్ఞలో మెలఁగఁజేసెను. తనయల వరించి, కోసలకేకయమగధులను నయాజ్ఞలో మెలఁగఁజేసెననియుఁ జెప్పవచ్చును.
భారత. ధృతిన్ = సంతోషముచేత, “ధృతిర్యోగాంతరే ధైర్యే ధారణాధ్వర తుష్టిషు” అని వి. కుంతిమద్రభూపతులయొక్క, నెయ్యఁపుఁగన్యకలన్ = కుంతీమాద్రులను, ననవాలుదూపులన్ = పుష్పబాణములచేత, జయించి, అలరారు = ఒప్పుచున్న, అతను = మన్మథునికి, జయశ్రీలన్ = జయశ్రీలైనవారిని - కన్యకలకు విశేషణము. వరియించెన్ = వివాహమాయెను - కడమసమానార్థము. కోసలకేకయమగధులన్ = ఈదేశములరాజులను, 'తద్రాజస్యబహుషుతేనైవాస్త్రియా' మని అఙ్ప్రత్యయలోపము. తనయొక్క, అలవరించిన = నియమించిన, క. 'అచ్చుగఁ బెరయచ్చులపై, యచ్చు యకారంబు దాల్చు