| తే. | రామభద్రుండు సన్మార్గరక్షణైక | 261 |
రామ. దిక్ = దిక్కులకు, అవతంసిక = అలంకారముగాఁ జేయఁబడిన, కీర్తియనెడి, పాండుసూనుఁడు = తెల్లనిపుష్పములు గలవాఁడు, రామభద్రుండు, చతురమనోహరమైన, ఆత్మ = హృదయముగల, అనుజ = తమ్ములచేత, ఉపచరిత = సేవింపఁబడిన, చరణుఁడగుచున్ = పదములు గలవాఁడై, సామ్రాజ్యంబు సలుపునపుడు, భూమిపై నీలాగు సంతోషమున నుండెను.
భారత. రామ= ఒప్పుచున్న, భద్రముగలవాఁడు, దిగవతంసితమైన కీర్తిగలవాఁడు, పాండుసూనుఁడు = ధర్మరాజు, చతుః = నలుగురైన, ఆత్మ = తనయొక్క, అనుజులచేత, ఉపచరిత = సేవింపఁబడిన, చరణములు గలవాఁడౌచు సామ్రాజ్యంబు సలుపునపుడు శ్రీధాన్యకటకమై చెలువొందె రాష్ట్రంబు.
| శా. | దేవా దేవరప్రేరణంబునన యుద్దీపించు వాగ్వైభవ | 262 |
| శా. | క్రీడామాత్రకృతత్రిమూర్తిభరణాంగీకారచూడాపరి | 263 |
క్రీడామాత్రముచేత నేకృతమైన, త్రిమూర్తి = బ్రహ్మవిష్ణుమహేశ్వరరూపములయొక్క, భరణ = ధారణముయొక్క, అంగీకారము గలవాఁడా! త్రిమూర్తులును నీలీల లనుట. చూడా = శిఖయందు, “చూడాకిరీటం కేశాశ్చ" అని అ. పరిభ్రాట్ = ఒప్పుచున్న, ఆదిత్యధునీ = దేవనదియొక్క, "ఆదిత్యా ఋభవోస్వప్నాః" అని అ. "తటినీహ్రాదినీ ధునీ” అనియు అ. పృషత్ = బిందువులచేత, “వృషంతి బిందుపృషతౌ” అని అ. పుషిత = పోషింపఁబడిన, పంపానదియందలి శైత్యము గలవాఁడా! వేధః = బ్రహ్మచేతను, "స్రష్టా ప్రజాపతిర్వేధాః" అని అ. మరుత్ = దేవతలకు, “మరుతౌ పవనామరౌ” అని అ. రాట్ = రాజైన యింద్రునిచేతను, ఆరాధింపఁబడిన పాదములు గలవాఁడా! అం